Savithri : హీరోలకు ధీటుగా నటించి, ఒక దశలో హీరోలే ఆమెతో నటించాలంటే జాగ్రత్త పడేంతగా నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి మహానటి సావిత్రి. అంతటి నటికి ఒక అవార్డు రాలేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. సావిత్రికి అవార్డులంటే ఇష్టం లేదా.. అయినా ఏం పర్వాలేదు ఎవరో ఇచ్చే అవార్డులు ఆమె నటనకు కొలమానం కాదు. జనం ఆమెను మహానటి అంటూ అన్నిటికంటే గొప్ప అవార్డు ఇచ్చేసారు. సావిత్రి గారి నటన గురించి మాట్లాడితే దిగ్గజ నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు గార్లు కూడా ఆమెతో పాటు నటించేటపుడు జాగ్రత్త పడేవారట. ఒకానొక సందర్బంలో సావిత్రి తో నటించాలంటే ఒక్కోసారి భయం వేస్తుంది, ఆమెతో నటించడం గొప్ప అనుభవం అంటూ ఎన్టీఆర్, ఎస్వి రంగారావు వంటి వారే చెప్పడం ఆమె నటన ఏ రేంజ్లో ఉంటుందో తెలుపుటకు ఉదాహరణ.

మరణించేటపుడు చెప్పిన ఆఖరి కోరిక…
అంత గొప్పగా నటించి పేరు తెచ్చుకున్న సావిత్రి జీవితంలో చివరి దశల్లో చాలా ఇబ్బందులు అనుభవించి మరణించింది. ఎంతో మందికి గుప్త దానాలు చేసిన సావిత్రి చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ మరణించారు. అయితే ఆమె మరణించే ముందు ఆమె చివరి కోరిక చెప్పింది. ఆమె చివరగా నటించిన ‘చివరకు మిగిలేది’ చిత్రానికి ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా అందింది. ఆమె జీవితం ఎంతో మందికి ఆదర్శం. చాలా మంది వర్ధమాన నటీమణులకు జీవితం ఎలా చక్కదిద్దుకోవాలో నేర్పించే గుణపాఠం.

తాను చనిపోయాక తన సమాధిపై ఏమని రాయాలో వివరించిందట. మరణంలోనూ, జీవితంలోనూ ఒక మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వతమైన విశ్రాంతిని పొందుతుంది. ఇక్కడికి ఎవరొచ్చినా కూడా సానుభూతితో తమ కన్నీళ్ళని విడవనక్కర్లేదు. ఈ ఇండస్ట్రీలో కూడా ఎవరూ హీనంగా చూడకుండా మరణం లేని ఆ సమాధిలో నిద్రిస్తున్న మహా ప్రతిభకు చిహ్నంగా ఒక పూమాలను ఉంచండి…. ఇదే మీరు నాకు ఇచ్చే గౌరవం అని సావిత్రి అన్నారట. ఆమె చివరగా నటించిన ‘చివరకు మిగిలేది’ చిత్రానికి ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా అందింది. అలా సమాధి మీద ఏం రాయాలో మరణించే ముంది సావిత్రి గారు చెప్పి తన మహోన్నత వ్యక్తిత్వాన్ని మరోసారి చాటి చెప్పారు. ఇక ఈ విషయాలను ప్రముఖ సినిమా విమర్శకుడు నందగోపాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివరించాడు.
































