Savithri daughter Chamundeswari : అలనాటి తార సావిత్రి గారు హీరోలకు ధీటుగా ఎదిగిన స్టార్. సినిమాల్లోకి వచ్చిన కొద్ది కాలానికే అగ్ర హీరోయిన్ గా ఎదిగి ఇప్పటికీ ఎంతోమందికి నటనలో బెంచ్ మార్క్ సెట్ చేసిన మహానటి. ఆమె వెండి తెర మీద ఒక వెలుగు వెలిగినా నిజ జీవితంలో మాత్రం ఓడిపోయింది. భర్త, నమ్మిన వారు మోసం చేయడం వల్ల ఆర్థికంగానూ, మానసికంగానూ క్రుంగిపోయి మరణించారు. ఆమె జీవితకథను ‘మహానటి’ గా సినిమా తీసి అలాంటి ఆ మహనటి గురించి ఈ తరం వారికి తెలియజేసారు. ఇక సావిత్రి గారి కూతురు విజయ చముండేశ్వరి గారు ఆమె భర్త గోవిందరావు గారు సావిత్రి గారి జ్ఞాపకాలను తన ఇంట్లో భద్రపరుచుకున్న జ్ఞాపకాలను పంచుకున్నారు.

తమ్ముడికి నాకు ఎంత ఆస్తి ఇచ్చారంటే…
విజయ చాముండేశ్వరి గారు సావిత్రి గారి జీవితం గురించి మాట్లాడుతూ ఎన్నో దాన ధర్శమాలను చేసినా ఆస్తులను కూడబెట్టారంటూ చెప్పారు. రెమ్యూనరేషన్ కోసం ఇళ్లను స్థలాలను కొనేవారాంటూ సావిత్రి గారి అల్లుడు గోవిందరావు తెలిపారు. అలా కొడకెనాల్ లో ఒక ఇళ్ళు, హైదరాబాద్ లో రెండు ఇల్లులు అలాగే చెన్నై లో మూడు ఇల్లులు చివరికి ఆస్తి మొత్తం పోయాక మిగలాయంటూ తెలిపారు. ఆ ఆస్తిలో నేను తమ్ముడు భాగం పంచుకున్నామని తెలిపారు. చెన్నై లో ఉన్న మూడు ఇళ్లలో మా బాగానికి వచ్చినదాన్ని పడగొట్టి షాపింగ్ కాంప్లెక్స్ కట్టించాము. అందులో లలితా జ్యువలరీ వాళ్ళ షాప్ ఉండేది. ఆ ఆస్తి అమ్మి పిల్లలకు ఏదైనా చేయాలని అనుకున్నపుడు లలితా జ్యువలరీ కిరణ్ గారు ఆ షాప్ ను కొంటానని వేరేవాళ్లకు అమ్మవద్దని అడగడంతో ఆ షాప్ ఆయనే కొనుక్కున్నారు.

ఆయనకు ఆ షాప్ బాగా కలిసివాచ్చిందని సెంటిమెంట్, అలానే మాకు ఆ ఆస్తి అమ్మి పిల్లలకు ఇళ్ళు కొనిచ్చి మేము ఒక ఇళ్ళు మాకోసం కొన్నాము, అలా ఇప్పటికీ ఆమె ఆస్తి వల్లే సెటిల్ అయ్యాము అంటూ తెలిపారు చాముండేశ్వరి. అలానే సావిత్రి గారికి బంగారం అంటే చాలా ఇష్టమంటూ చెప్పారు చాముండేశ్వరి. తన వద్ద బంగారు గాజులే చాలా ఉండేవి, ఇన్కమ్ టాక్స్ రైడ్ జరిగినపుడు బీరువాలో ఉన్న బంగారం అంతా కలిపి ఒక పెద్ద బెడ్ షీట్లో మూట కట్టారు. ఇక పెళ్లి జరిగినపుడు ఒక పెట్టె నిండా వెండి సామాన్లు ఇచ్చారు అంటూ సావిత్రి గారి ఆస్తుల గురించి తెలిపారు.
































