నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్తను తెలిపింది.SBI లో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.స్పెషల్ కేడర్ ఆఫీసర్-SCO పోస్టుల భర్తీకి దరఖాస్తు విండోను మళ్లీ ఓపెన్ చేసింది. ఫైర్ ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 16 ఖాళీలు ఉన్నాయి. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే అభ్యర్థులకు కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉంది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనే వారు జూన్ 28వ తేదీ చివరి రోజు. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 28వ తేదీలోగా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా బీఈ (ఫైర్) పాస్ లేదా నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీ నుంచి బీటెక్ లేదా బీఈ పాస్ కావాలి. అదేవిధంగా ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ ఈ విభాగంలో బీటెక్ లేదా బీఈ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్లలో అప్లై చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు Latest Announcments లో ఫైర్ మేనేజర్ జాబ్ నోటీస్‌లో Apply Online క్లిక్ చేయగానే మనకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి మీ పేరు పుట్టిన తేదీ మొబైల్ నెంబర్ వంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ విధంగా వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత దరఖాస్తు ఫీజు రూ.750 చెల్లించడంతో మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. దరఖాస్తు పూర్తికాగానే అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపరచుకోవాలి.































