తెలుగు సిని నటి ప్రగతి. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా తల్లి, అత్త వంటి సహాయ పాత్రలలో నటించి తన నటనకు మంచి పేరు సంపాదించుకుంది. ఏమైంది ఈవేళ సినిమాలో హీరో తల్లిగా నటించి ఉత్తమ సహాయ నటి అవార్డు కూడా సొంతం చేసుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషలలో కూడా నటించింది. ఇక ఈ మధ్య అభిమానులకు మరింత దగ్గరలో ఉంది.

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ప్రగతిపై ఎక్కువగా పడిందనే చెప్పవచ్చు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలతో, డాన్స్ వీడియోలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. లేటు వయసులో కూడా హీరోయిన్స్ లను మించి గ్లామర్ ను పరిచయం చేస్తుంది. వెండితెరపై కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన ఈమె ప్రస్తుతం మొత్తం గ్లామర్ లుక్ తో బాగా రచ్చ చేస్తుంది.
అంతే కాకుండా ఈ మధ్య ఫిట్ నెస్ మీద కూడా బాగా శ్రద్ధ పెట్టింది ప్రగతి. తెగ వర్క్ అవుట్ లు చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఇక ఈమె చేసే వర్క్ అవుట్ లను చూసి నెటిజన్లు ఈ వయసులో కూడా రెస్ట్ తీసుకోకా అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో వర్క్ అవుట్ లు చేస్తూ ఫుల్ ఎనర్జీ గా కనిపించింది.
ఈ వీడియోకు.. కొన్నిసార్లు వంతెన తెంచేసి మరీ ఈత నేర్చుకోవాలి. వర్క్ అవుట్స్ అనేవి అందరిలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయని తెలిపింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. నెటిజన్లు తెగ లైక్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ నెటిజన్.. మీరు ఇంత కష్టపడుతున్నా.. సన్నబడటం లేదేంటి మేడమ్ అని ప్రశ్నించగా.. వెంటనే వర్క్ అవుట్స్ అనేవి సన్నబడటం కోసం కాదని.. శారీరకంగా, మానసికంగా దృఢంగా కావడానికి అంటూ సమాధానం ఇచ్చింది.


































