ఈ మధ్య కాలంలో కామాంధులు ఎంతటికైనా తెగించేస్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే చాలు ఈ కామ పిశాచులు వదిలిపెట్టడం లేదు. ఇంటి నుంచి బయటకు వచ్చిన అమ్మాయి తిరిగి ఇంటికి వచ్చే దాక కూడా నమ్మకం లేకుండా పోతుంది.

ప్రస్తుతం ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం.. అయితే ఇలాంటి కోవలోకి చెందిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. లేడీస్ బాత్రూంలో సెల్‌ఫోన్‌తో రహస్యంగా చిత్రీకరించారు. దీనిని ఓ యువతి గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్-10లో ఓ రెస్టారెంట్‌లో జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్లే.. జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్-10లోని ఫుడ్‌కోర్టులోని మహిళల బాత్రూంలో ఓ కెమెరాను గుర్తించారు. దానిని ఓ యువతి ఫుడ్ కోర్టుకు వెళ్లగా బాత్రూంలో ఆన్ చేసి ఉన్న సెల్‌ఫోన్‌ను గుర్తించింది. దీంతో వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు
ఫుడ్‌కోర్టులోని సెల్‌ఫోన్ ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఆ సెల్ ఫోన్ నిన్నటి నుంచి ఆన్ లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే టాయిలెట్ లో ఎవరు సెల్ ఫోన్ పెట్టారనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఫుడ్‌కోర్టులో బాత్రూం క్లీనింగ్ చేసే బెనర్జీ అనే వ్యక్తి ఇందుకు కారణమని పోలీసులు కనిపెట్టారు. దీంతో పోలీసులు బెనర్జీని అరెస్టు చేశారు. అతడు ఒక్కడే ఉన్నాడా.. మరెవరైనా అతడి వెనుక ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.


























