పెళ్లి అంటే స్వర్గంలో నిర్ణయం చేయబడుతుంది అంటారు. ఆ పెళ్లి అంగరంగ వైభవంగా చేసుకోవాలని ప్రతి అమ్మాయి, అబ్బాయి కలలు కంటారు. కానీ అవి అందరికి సాధ్యం కావు. కొందరు అనుకోని పరిస్థుతులలో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి పారిపోయి రహస్యంగా వివాహం చేసుకోవాల్సి వస్తుంది.

ఇది సాధారణంగా చాల చూస్తూనే ఉన్నాం. కానీ ఇలాంటి పనులు సెలెబ్రేటిస్ చేస్తేనే అది పెద్ద న్యూస్… కానీ ఇది ఇప్పటి నుండి మొదలయ్యింది అనుకుంటే పొరపాటే..నాటి సావిత్రి జయ ప్రద శ్రీదేవి నుండి నేటి శ్రియా శరన్ వరకు అందరు పెళ్లిళ్ల విషయంలో చాల సీక్రెట్ గా వ్యవహరిస్తున్నారు.

మహానటిగా పేరు తెచ్చుకున్న సావిత్రి గురించి వచ్చిన ‘మహానటి’ సినిమా పుణ్యమా అని అందరికి తెలిసింది కానీ ఆమె అప్పటికే పెళ్లయిన జెమినీని ప్రేమ్మించి పెళ్లి చేసుకున్న తర్వాత నాలుగేళ్ళ వరకు ఆ విషయం ఎవరికీ చెప్పకుండా కాపురం చేసింది. తర్వాత జరిగిన కథ అంత అందరికి తెలిసిందే.

ఇక ఇదే దోవలో జయప్రద సైతం శ్రీకాంత్ నహతా అనే బాలీవుడ్ ప్రొడ్యూసర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఈ విషయం అటు ఫామిలీ కి కానీ ఇటు ఇండస్ట్రీ వారికీ కానీ తెలియదు. కారణం శ్రీకాంత్ నహతాకి అప్పటికే పెళ్లయి పిల్లలు ఉండటమే కారణం.

ఇక శ్రీదేవి కూడా అంతే మొదట మిథున్ చక్రవర్తిని ప్రేమించి రహస్యంగా తాళి కట్టించుకుంది. మూడేళ్ళ తర్వాత బోనీ ఎంట్రీతో ఆ పెళ్లికి నీళ్లు వదిలేసి అతి కొద్దీ మంది సమక్షంలో బోనీని పెళ్లి చేసుకుంది. ఆ సమయానికి శ్రీదేవి మూడు నెలల గర్భవతి.

ఇక ఇలాగే ప్రేమలో పడి ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్న మరొక హీరోయిన్ దేవయాని.. రాజకుమారన్ అనే సినిమా డైరెక్టర్ తో ప్రేమలో పడిన విషయం ఇంట్లో చెప్తే అంగీకరించకపోవడం తో విదిలేని పరిస్థితిలో ఇంట్లో నుండి పారిపోయి రహస్య వివాహం చేసుకున్నారు.

ఇక నితిన్ అ ఆ సినిమాలో చెల్లి పాత్రలో నటించిన అనన్య సైతం ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పారిపోయి ఆంజనేయులు అనే వ్యక్తి ని పెళ్లి చేసుకుంది.

ఇక నిన్నటి తరం హీరోయిన్ సీత మొదట పార్తీబన్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకొని విడిపోయాక సీరియల్ నటుడు అయినా సతీష్ అనే వ్యక్తిని ఏవైరికి చెప్పకుండా రహస్యంగా వివాహం చేసుకుంది. అయినప్పటికీ ఈ వివాహం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు.

ఇక బిచ్చగాడు సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయం అయినా హీరోయిన్ సాత్నా టైటస్ రహస్యంగా వివాహం చేసుకుంది. బిచ్చగాడు చిత్రాన్ని తమిళనాట విడుదల చేసిన బయ్యర్లలో ఒకరైన కార్తికీ నటి సాట్నాకు మధ్య ప్రేమ చిగురించింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పారిపోయి రహశ్యంగా వివాహం చేసుకున్నారు.

2001వ సంవత్సరంలో ఇష్టం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శ్రియా సరన్. అయితే ఈ అమ్మడు రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్లయిన రెండేళ్లు కావస్తుండగా తాజాగా శ్రియ తన పెళ్లికి బంధం గురించి స్పందించింది. 2018 మార్చిలో రష్యా దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు ఆండ్రీ కోషీవ్ ను తాను పెళ్లి చేసుకున్నానని అయితే ఈ వివాహానికి తక్కువ మంది మాత్రమే హాజరయ్యారని అన్నారు. అంతేగాక తన పెళ్లి గురించి రహస్యంగా ఉంచిన శ్రీయ తన భర్త గురించి కూడా ఎటువంటి వివరాలు కూడా ఆ సమయంలో బయట ప్రపంచానికి తెలియనివ్వ లేదు.

బాలీవుడ్ భామ రాణి ముఖర్జీ సైతం డైరెక్టర్ ఆదిత్య చోప్రాని రహస్య వివాహం చేసుకొని మీడియాకి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంతే. ఇక మరొక హీరోయిన్ రమ్య కృష్ణ సైతం గుడిలో రహస్యంగా వివాహం చేసుకొని మీడియాకి ఫోటోలు విడుదల చేసారు.































