Sekhar Master: సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో శేఖర్ మాస్టర్ ఒకరు. ఈయన కొరియోగ్రాఫర్ గా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇకపోతే శేఖర్ మాస్టర్ ఒకవైపు కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఢీ డాన్స్ షో కార్యక్రమానికి శేఖర్ మాస్టర్ తో పాటు గణేష్ మాస్టర్ కూడా జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. వీటితోపాటు నటి హన్సిక కూడా ఈ కార్యక్రమంలో జడ్జిగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు.
ఈ కార్యక్రమంలో మధు అనే కంటెస్టెంట్ డాన్స్ చేస్తున్న సమయంలో తప్పుగా వేయడంతో పెర్ఫార్మెన్స్ మొత్తం ఆగిపోయింది. ఇలా పెర్ఫార్మెన్స్ ఆగిపోవడంతో శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ డాన్సర్లు తప్పు చేసిన నువ్వు ఈ పర్ఫామెన్స్ కంటిన్యూ చేయాల్సింది అంటూ తెలియజేశారు. అంతేకాకుండా మేము డాన్సర్లము మేము ఎక్కడ తప్పు చేస్తే అక్కడి నుంచి మాస్టర్ వెళ్ళిపోతారు అని ఎప్పుడు భయపడే వాళ్ళము.
డాన్స్ ఒకటే తెలుసు..
మాస్టర్ వెళ్ళిపోతే మాకు వర్క్ తగ్గుతుందనే భయంతో మేము ఉండే వాళ్ళమని ఎందుకంటే మాకు డాన్స్ తప్ప మరి ఏమి రాదు అంటూ శేఖర్ మాస్టర్ చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన ఇలాంటి కామెంట్ చేయడంతో అక్కడున్నటువంటి కొందరు డాన్సర్లు కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు.



























