కరోనా మహమ్మారి విజృంభణ వల్ల గతేడాది మార్చి నెల 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు కాగా ఆ తరువాత కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అన్ లాక్ సడలింపులను అమలు చేస్తోంది. అయితే కరోనా విజృంభణ వల్లే మన దేశంలోని ప్రజలకు లాక్ డౌన్ అనే పదం తెలిసింది.

అయితే తమిళనాడు రాష్ట్రంలోని ఒక గ్రామంలో మాత్రం వెయ్యి సంవత్సరాలుగా ప్రజలు సెల్ఫ్ లాక్ డౌన్ లో ఉన్నారు. తమ ఊరి చుట్టూ గోడను కట్టుకొని లోపల జీవనం సాగిస్తున్నారు. పనుల కోసం పురుషులు మాత్రమే గ్రామం నుంచి బయటకు వెళుతుండగా మహిళలు మాత్రం పూర్తిగా గ్రామానికే పరిమితమవుతున్నారు. దక్షిణ తమిళనాడులోని శ్రీ వైకుంఠం గ్రామంలో మొత్తం 65 కుటుంబాలు ఉన్నాయి.

ఆ ఊరి చుట్టూ వెయ్యి సంవత్సరాల క్రితం పెద్ద మట్టిగోడను నిర్మించారు. ఆ మట్టిగోడకు నాలుగు ద్వారాలు ఉండగా గ్రామంలోకి రావాలన్నా, గ్రామం నుంచి బయటకు వెళ్లాలన్నా ఆ నాలుగు మార్గాల ద్వారా మాత్రమే వెళ్లడం లేదా రావడం సాధ్యమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రాకతో పజల జీవనశైలిలో ఎన్నో మార్పులు వస్తుంటే అక్కడ మాత్రం ఇప్పటికీ ప్రజలు ప్రాచీన సంస్కృతినే ఆచరిస్తున్నారు.

మన దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు రెండు నెలల లాక్ డౌన్ కే పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే ఆ గ్రామ ప్రజలు మాత్రం కాలం మారుతున్నా నేటికీ లాక్ డౌన్ చేసుకుని జీవనం సాగిస్తూ ఉండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here