Senior Naresh:సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సినీ తారలు ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియాలో వార్తలలో ఉంటారు. ఈ క్రమంలోనే వారికి సంబంధించిన ఏదో ఒక విషయం ద్వారా ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే సీనియర్ నటుడు నరేష్ గత కొద్ది రోజుల క్రితం సొంత కారవ్యాన్ కొనుగోలు చేసిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలోనే తన కారవ్యాన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా కారవాన్ కొనుగోలు చేసిన కొన్ని రోజులకే మరొక స్పోర్ట్స్ కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తన స్పోర్ట్స్ కారుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా ఆ కారుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడమే కాకుండా కారుతో కలిసి దిగిన ఫోటోని తన ప్రొఫైల్ గా పెట్టుకున్నారు. చాలా రోజుల తర్వాత తన కల నెరవేరిందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువ..
పర్పుల్ కలర్ కలర్ కలిగిన ఈ స్పోర్ట్స్ కారు డ్రైవ్ చేస్తూ సరదాగా రోడ్డుపై చక్కర్లు కొట్టారు. ఎంతో అందంగా కనిపించే ఈ స్పోర్ట్స్ కారు ధర సుమారు 35 లక్షల వరకు ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కారుని డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై ప్రయాణం చేస్తున్న వీడియోని కూడా ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో ఎంతో మంది అభిమానులు అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Hi sharing my new dream come true with my twitter family???? pic.twitter.com/rnxev9r2Ts
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) February 2, 2022
































