ప్రముఖ హిందీ నటుడు రిషి కపూర్ (67) అనారోగ్యం పాలవడంతో ఈరోజు ఉదయం కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో బుధవారం రాత్రి ఆయన్ని ముంబై లోని హెచ్ఎన్ రియలన్స్ ఆసుపత్రికి తరలించారు. కొద్దిరోజులుగా క్యాన్సర్ తో బాధ పడుతున్న అయన, శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. 2018 నుంచి రిషి కపూర్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అదే సమయంలో న్యూయార్క్ లో చికిత్స తీసుకున్నారు. ఇటీవలే అయన క్యాన్సర్ నుంచి కోలుకున్నారని అయాన భార్య నీతూ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. లాక్ డౌన్ సమయంలో అయన యోగ చేస్తున్న ఫోటోలను కూడా షేర్ చేసారు ఆమె.

నిన్న రాత్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో ఆయన్ను ముంబై లోని హెచ్ఎన్ రియలన్స్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే అయన ఆరోగ్యం విషమించడంతో రిషి కపూర్ ఈరోజు ఉదయం అయన మరణించారు. ఇక రిషి కపూర్ సినిమాల విషయానికి వస్తే ఆయన ఇటీవల ముల్క్ అనే సినిమాలో నటించి మరోసారి అదరగొట్టారు. ఆయన తాజాగా ది బాడీ అనే సినిమాలో నటించారు. అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా అయన కనిపించారు. రిషి కపూర్.. ప్రముఖ హిందీ యువ హీరో రణ్ బీర్ కపూర్‌కు తండ్రి అని తెలిసిందే.



































