అమ్మ పేరు పెట్టి తిడతారా.. ఉత్తేజ్ ఎమోషనల్ కామెంట్స్..!

0
353

ఎట్టకేలకు మా ఎన్నికలు ముగిశాయి. మంచు విష్ణు అధ్యక్షుడిగా ప్రకాశ్ రాజ్ పై గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల వ్యవహారం ముగిసిన దగ్గర నుంచి ప్రతీ ఒక్కరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నిన్న సాయంత్రం ప్రకాష్ రాజ్ విలేకరుల సమావేశంలో విష్ణు కు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశ్యంతో ప్యానల్ సభ్యులు రాజీనామా చేశారని చెప్పాడు.

ఇలా.. మా ఎన్నికలు ముగిసినా వేడి మాత్రం తగ్గలేదు. ఆ రాజీనామాలను తాను ఆమోదించనని.. అందరం కలిసి ముందుకు వెళ్తాం అంటూ చెప్పుకొస్తున్నాడు మంచు విష్ణు. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు ఉత్తేజ్ మాట్టాడారు. ఆయన ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఎన్నికలు ముగిసిన తర్వాత ‘మా’లో నరేష్ ప్రవర్తన అస్సలు బాగాలేదేని.. ఎన్నికలు జరిగిన రోజు దగ్గర నుంచి కూడా ప్రతీ ఒక్క వ్యక్తిని వ్యక్తిగతంగా దూషిస్తున్నారని.. అమ్మల పేరు పెట్టి మరీ బూతులు తిడుతున్నారని అన్నారు. ఈసీ సభ్యులం అయిన తాము ‘మా’ కార్యాలయానికి వెళ్లాలంటే.. థంబ్ ఇంప్రెషన్ పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అతడు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల రోజు నరేష్ అన్న మాటలు తాను మర్చిపోలేను అని.. అతడు తన మొహంలో పెట్టి.. ఒక్కో ల*జా కొడుకు పని చెప్తా అంటూ సవాల్ విసిరాడు అని చెప్పాడు. ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాము వారితో కలిసిపోయి ఎలా పని చేస్తాం అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా ఉత్తేజ్ ఎమోషనల్ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.