Senior Actor Varalakshmi : నాగేశ్వరావు గారి సినిమా ‘అందాలరాముడు’తో ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బేబీ వరలక్ష్మి గా ఫేమస్ అయిన నటి వరలక్ష్మి. కొన్ని వందల సినిమాలలో బాల నటిగా చేసిన వరలక్ష్మి ఆపై హీరోలకు చెల్లిగా కూడా ఎక్కువ సినిమాలలో నటించారు. ఎక్కువగా కృష్ణ గారికి చెల్లిగా నటించి నిజంగానే ఆయన చెల్లి అనేలా ఒదిగిపోయి నటించారు. ఇక ఆ తరువాత తరం అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలకు చెల్లిగా నటించిన వరలక్ష్మిగారు పెళ్లి అయ్యాక పాప పుట్టిన తరువాత సినిమాలను తగ్గించి సీరియల్స్ ను చేస్తూ తెలుగు ఇండస్ట్రీకి కొంత దూరమయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వరలక్ష్మి గారు తన సినిమా అనుభవాలను పంచుకున్నారు.

కూతురు అల్లుడు ఏం చేస్తారంటే…
వరలక్ష్మి గారు కెరీర్ పీక్స్ లో ఉన్నపుడే పెళ్లి చేసేసుకున్నారు. 19 ఏళ్లకే పెళ్లి చేసుకున్న వరలక్ష్మి గారి భర్త విశ్వనాథ్ గారు డాక్టర్. పెళ్లియ్యాక కూడా నటించిన వరలక్ష్మి గారు హీరోయిన్గా కంటే చెల్లెలి పాత్రలో ఎక్కువగా నటించింది. ఇక గర్భవతిగా ఉన్న సమయంలో కూడా నటించిన వరలక్ష్మి గారు ఆ సమయంలో చేసిన చిట్టెమ్మ మొగుడు సినిమాలో పడిపోయే సీన్ చేయడంతో లోపల బిడ్డకు ఏమైనా జరుగుతుందేమో అని భయపడి ఇక సినిమాలను చేయకూడదని అనుకున్నారట.

అలా మళ్ళీ బిడ్డ పుట్టాక ఆరు నెలలకు మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన పాపను వదిలి ఉండలేక కేవలం తమిళ సీరియల్స్ కి పరిమితమయ్యారు వరలక్ష్మి. కూతురు కోసం కెరీర్ ను పక్కనబెట్టిన వరలక్ష్మి గారు ఆమె కూతురిని సైకాలజీ చదివించారు. తన కూతురికి కూడా త్వరగా పెళ్లి చేసేసారు. తన అల్లుడు మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేస్తున్నారంటూ చెప్పారు. వాళ్ళకి ఒక పాప అంటూ మాది అందమైన కుటుంబం అంటూ తెలిపారు. ఇక చాలా మంది మద్రాస్ నుండి హైదరాబాద్ కు తెలుగు ఇండస్ట్రీ మారినపుడు హైదరాబాద్ వెళ్లలేక ఇక్కడ అవకాశాలు రాక సూసైడ్ చేసుకున్న టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఉన్నారంటూ తెలిపారు. అప్పటికే తమిళ కన్నడ సినిమాలను ఎక్కువగా చేయడం వల్ల నాకు ఇబ్బంది రాలేదని తెలిపారు వరలక్ష్మి. తాను చెల్లిలిగా నటిస్తున్న సమయంలోనే కొంత ఆస్తులవి చేసుకున్నానని, మరీ కోట్ల ఆస్తులు లేకపోయినా ఉన్నంతలో బాగా ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఇల్లు కొని అక్కడికి షిఫ్ట్ అవ్వాలని భావిస్తున్నారట వరలక్ష్మి. నిర్మాతలకు, డైరెక్టర్లకు అందుబాటులో ఉంటే తెలుగు సినిమా అవకాశాలు వస్తాయని చెప్పారు.





























