Senior Actress Nalini : చిరంజీవి డాన్స్ రిహార్సల్స్ పదిసార్లు చేస్తే.. నేను ఒకేసారి చేసేదాన్ని… అప్పుడు అలా ఉండేది. : హీరోయిన్ నలిని

0
517

నళిని తమిళం, మలయాళం, కన్నడ మరియు తెలుగు చిత్రాలలో ప్రసిద్ధి చెందిన భారతీయ నటి మరియు టెలివిజన్‌లో పనిచేసింది. తమిళనాడులో మూర్తి మరియు ప్రేమ దంపతులకు ఎనిమిది మంది సంతానంలో రెండవ వ్యక్తిగా నళిని 1964 ఆగస్టు 28న జన్మించింది. ఆమె తండ్రి తమిళ సినిమాలలో కొరియోగ్రాఫర్ మరియు ఆమె తల్లి ప్రొఫెషనల్ డ్యాన్సర్. ఆమెకు 7 మంది తోబుట్టువులు, ఒక సోదరి మరియు ఆరుగురు సోదరులు ఉన్నారు. ఆమె ఏడవ తరగతి వరకు TN ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది; అప్పటికి సినిమాలతో బిజీగా ఉండడంతో చదువు కొనసాగించలేకపోయింది.

నళిని 1987లో నటుడు రామరాజన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు కవలలు ఉన్నారు; అరుణ మరియు అరుణ్, 1988లో జన్మించారు. అయితే, వారు 2000లో విబేధాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆమె కుమార్తె అరుణ 6 మే 2013న రమేష్ సుబ్రమణియన్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె కుమారుడు అరుణ్ పవిత్రను 25 ఏప్రిల్ 2014న వివాహం చేసుకున్నారు. 1983 తమిళ డబ్బింగ్ చిత్రం “ప్రేమ సాగరం” చిత్రం ద్వారా తెలుగు యువ ప్రేక్షకులను ఆమె ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అవడంతో తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో చిరంజీవి ప్రక్కన “సంఘర్షణ” చిత్రంలో నటించారు. చక్రవర్తి అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదే చివరి చిత్రం అంటూ నలిని దాదాపు వంద చిత్రాల్లో నటించారు.

అయితే ఈ మధ్య ఆమె ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను ఒక రోజు దాదాపు నాలుగైదు షిఫ్ట్ లలో నటించే దానిని.. తనకు నిద్ర కూడా సరిగా ఉండేది కాదని. మా అమ్మగారి బలవంతంతో సినిమాలలో నటించానని. అయితే సంఘర్షణ సినిమాలో “సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా”.. అనే పాటకు చిరంజీవి ఎంతగానో కష్టపడ్డారని.. ఆయన‌ పదిసార్లు ప్రాక్టీస్ చేసి ఆ పాటకు డ్యాన్స్ చేశారని.. కానీ నేను ప్రాక్టీస్ చేయకుండా డాన్స్ చేశానని.. చిరంజీవి డాన్స్ అంటే ఒళ్ళు హూలం చేసుకుంటారని.. రోజూ నాలుగైదు షిఫ్ట్ లలో పని చేసేసరికి సినిమాలపై అంతగా ఆసక్తి తనకు ఉండేది కాదని వెళ్ళిపోదాం అంటే.. మా అమ్మగారు ఇదే లాస్ట్ సినిమా అంటూ నటింపజేశేవారని.. తాను ఏడవ తరగతి చదువుకుంటున్న సమయంలోనే మలయాళ ‌సినిమాలో నటించే అవకాశం వచ్చిందని అప్పటికే సినిమాలంటే తనకు అంత అవగాహన లేదని.

ఆ తర్వాత మరో తమిళ చిత్రంలో నటిస్తున్నప్పుడు ప్రముఖ దర్శకుడు. T.రాజేందర్ తనను చూసి “ప్రేమసాగరం” చిత్రానికి హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ సినిమా తమిళ తెలుగు భాషలలో దాదాపు సంవత్సరకాలం పాటు ఆడిందని.. ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నలిని చిరంజీవితో “ఇంటిగుట్టు” అనే చిత్రంలో నటించారు. తెలుగులో తక్కువ చిత్రాల్లో నటించినప్పటికీ ఆమె గుర్తుండిపోయే చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత చాలా కాలం విరామం తీసుకుని రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన “వీడే” చిత్రంలో నటించారు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన “కిక్” చిత్రంలో కనిపించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆమె బుల్లితెరలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.