Senior actress Roja Ramani home tour : తమిళనాట పుట్టి భక్త ప్రహల్లాద సినిమాతో బాల నటిగా జాతీయ ఉత్తమ బాలనటి అవార్డు అందుకున్న రోజా రమణి గారు పెద్దయ్యాక హీరోయిన్ గా హీరోలకు చెల్లిగా అనేక సినిమాలలో నటించింది. ఇక ఒరియా నటుడైన చక్రపాణిని వివాహం చేసుకున్న రోజా రమణి గారికి తరుణ్ అలాగే అమూల్య లు సంతానం. ఇక తెలుగు ప్రజలకు హీరో తరుణ్ సుపరిచితుడే. హీరోగా ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న తరుణ్ బాలనటుడిగా కూడా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. నేషనల్ అవార్డు కూడా సొంత చేసుకున్నాడు. ఇక తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ ద్వారా రోజా రమణి గారు ఉంటున్న ఇంటిని హోమ్ టూర్ వీడియో చేసారు. ఆ వీడియోలో తన సినిమా విశేషాలను పంచుకున్నారు రోజా రమణి.

ఇంద్రభవనం లాంటి ఇల్లు…
రోజా రమణి గారు తమిళనాడులో పుట్టి ఒరియా నటుడు చక్రపాణిగారిని పెళ్లి చేసుకున్నారు. అయితే హైదరాబాద్ లోనే సెటిల్ అయిన రోజా రమణి గారు ఇక్కడే పెద్ధ ఇల్లు కట్టుకుని సెటిల్ అయ్యారు. మదర్స్ డే సందర్బంగా ఆమె ఇంటిని హోమ్ టూర్ చేయగా అందులో రోజా రమణి గారు సాధించిన ఎన్నో అవార్డులను చూపించారు. ఇక అలాగే భర్త చక్రపాణి, అలాగే హీరో తరుణ్ కి సంబంధించిన ఎన్నో అవార్డులను చూపించారు.

ఇల్లు మొత్తం వైట్ అండ్ ఎల్లో బ్లాక్ కాంబినేషన్ లోనే కట్టుకున్నారు. తరుణ్ అమూల్య ఇద్దరికీ అలానే నచ్చుతుందని ప్లానింగ్ వాళ్లదే అంటూ చెప్పారు రోజా రమణి. మూడంతస్థుల వరకు ఇల్లు ఉండగా ఇల్లు చాలా విశాలంగా ఉండగా ఇక తరుణ్ గారి కారు కలెక్షన్ కూడా అదిరిపోయింది. ఒకవైపు బ్లూ జాగ్వార్ కారు అలాగే బెంజ్, రేంజ్ రోవర్ ఇలా పలు కార్లు ఉన్నాయి.