Senior artist Kukka Padma: సినిమా ప్రపంచం పైకి కనిపించినంత అందంగా లోపల ఉండదు. అందులోనూ ఎంతోమంది పేరు తెచ్చుకుని పైకి వచ్చినా లోపలున్న కుళ్ళు రాజకీయాలకు బలైపోతారు. అలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా వరుసగా సినిమాలు అందుకుని ఆపైన హీరోలకు చెల్లిగా కూడా రాణించిన నటి పద్మ గారు కూడా అలాంటి రాజకీయాలకే బలై సినిమా అవకాశాలు లేక ప్రస్తుతం కుటుంబ సభ్యుల మరణంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

యండమూరి వీరేంద్రనాథ్ అవకాశాలు రానివ్వలేదు…
కుక్క సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పద్మ గారు, ఆ సినిమాతోనే కుక్క పద్మ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆ సినిమా తరువాత వరుసగా ఎనిమిది సినిమాల్లో హీరోయిన్ గా ఆంధ్ర కేసరి, విముక్తి వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. ఇక మొండి ఘటం సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటించారు కుక్క పద్మ. అయితే వరుస అవకాశాలతో బిజీగా ఉన్న సమయంలో యండమూరి వీరేంద్రనాథ్ తనని రెండో వివాహం చేసుకోవాల్సిందిగా అడగటం, ఆమె తిరస్కరించడంతో ఆమెను బాగా ఇబ్బంది పెట్టాడట. ఆమెకు అవకాశాలు రాకుండా చేసి ఇండస్ట్రీ నుండి బయటకు వెళ్లిపోయేలా చేసాడు అంటూ పద్మ గారు ఎమోషనల్ అయ్యారు. 1986 వరకూ సినిమాల్లో బాగా నటించిన తాను ఆపైన సినిమాల్లో కనిపించలేదని తెలిపారు. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, ఇక ఆయన సంపాదనతోనే గడిచేది. నాకూ సినిమాల్లో పెద్దగా ఏమి వచ్చేది కాదు అంటూ చెప్పారు.

యండమూరి వీరంద్రనాథ్ సినిమాల్లో అవకాశాలు రాకుండా చేస్తూ మరోవైపు తనని పిచ్చిది అంటూ ప్రచారం చేయడంతో అవకాశాలు రావని అర్థమయ్యాక తన తండ్రి సూరిబాబు అనే వ్యక్తితో వివాహం చేయగా భర్తకు అప్పటికే పెళ్ళై పిల్లలున్నారు. విషయం తెలిసాక విడాకులు తీసుకున్నాను. ఆ వ్యక్తిని యండమూరి వీరేంద్రనాథ్ చేరదీసి మేనేజర్ ను చేసాడు. పేరు కూడా సూరిబాబు తీసి గోపి గా మార్చాడు. అతని కూతురు అస్మిత కాటమ రాయుడు సినిమాలో ఆలీ భార్యగా చేసింది. నా కూతురు అని చెప్పి ఇండస్ట్రీలో అవకాశాలు సంపాదించారు. ఇప్పటికీ నాకు ఎటువంటి అవకాశాలు రాకుండ వీరేంద్రనాథ్ చేస్తున్నాడు అంటూ ఆరోపించారు కుక్క పద్మ. ఇప్పటికీ సినిమాల్లో నటించడానికి కానీ డబ్బింగ్ చెప్పడానికి కానీ అవకాశాలు రానివ్వకుండా ఆ వ్యక్తి చేస్తున్నాడు అంటూ తిండికి కూడా కష్టమైందంటూ బాధపడ్డారు.