Senior child artist Bramha Kumari : రోజా రమణి సెట్ లో బాగా కమాండింగ్ చేసేది…: సీనియర్ బాల నటి బ్రహ్మ కుమారి

0
393

Senior child artist Bramha Kumari : పాత తరం సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సుమారు 40 కి పైగా చిత్రాల్లో నటించిన సీనియర్ నటి బ్రహ్మ కుమారి. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా సీనియర్ హీరోలతోను అప్పటి వర్ధమాన హీరోలతోను నటించారు. మూగ నోము, భలే తమ్ముడు వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆమె ఎక్కువగా మగపిల్లాడిగానే నటించారు. శ్రీదేవి, బేబీ రాణి, డాలి, రోజా రమణి గారితో ఎక్కువగా నటించిన బ్రహ్మ కుమారి గారు ఆ పైన సినిమాలను వదిలేసి కాకినాడ వెళ్లిపోయారు. మళ్ళీ చాలా ఏళ్ల తరువాత యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనిపించిన ఆమె సినిమా విశేషాలను ఆమె వ్యక్తిగత విశేషాలను పంచుకున్నారు.

రోజా రమణి చాలా కమాండింగ్…

చిన్నప్పడు హీరో పాత్రలకు, హీరోయిన్ చెల్లి గాను ఎక్కువగా నటించిన బ్రహ్మ కుమారి గారు రోజా రమణి గారి కాంబినేషన్ అలాగే శ్రీ దేవి ఇంకా అప్పటి చైల్డ్ ఆర్టిస్టులుగా ఉన్న వారితో కలిసి చాలా సినిమాల్లో నటించారు. అయితే ఎక్కువగా తాను అటు ఇటుగా తన వయసే ఉన్న బేబీ రాణి తో ఎక్కువగా ఆడుకునేదాన్ని అంటూ చెప్పారు. రోజా రమణి గారు మాకు సీనియర్ అందులోనూ సినిమాల్లో కూడా అప్పటికే ఆమె సీనియర్ అవ్వడం వల్ల సెట్స్ లో అక్క లాగా వ్యవహరించేది. అలా చేయకు, ఇది ముట్టుకోకూడదు అంటూ అల్లరి చేయనిచ్చేది కాదు.

ఎలా నటించాలో కూడా కొన్నిసార్లు చెప్పేది అంటూ ఆమె కెరీర్ విశేషాలను పంచుకున్నారు. ఇక బడిపంతులు సినిమాలో శ్రీదేవి చేసిన పాత్ర తనకు మొదట అవకాశం రాగా అప్పటికే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలని తన తల్లిదండ్రులు అనుకోవడం వల్ల అప్పటికే చేస్తున్న సినిమా షెడ్యూల్ వల్ల ఆ సినిమాలో అవకాశం కోల్పోయాను అంటూ చెప్పారు. ఇక కాకినాడలో స్థిరపడిన బ్రహ్మ కుమారి గారు ప్రస్తుతం కాలేజీ లెక్చరర్ గా ఉంటూ వైస్ ప్రిన్సిపాల్ హోదాలో పనిచేస్తున్నారు.