Senior Heroins : సినిమా రంగంలో ప్రేమలు, డేటింగులు చాలా కామన్. ఎవరికి నచ్చిన వారితో వారు సహజీవనం చేసిన ఘటనలూ ఉన్నాయి. నచ్చితే కలిసి ఉంటారు. నచ్చకపోతే విడిపోతారు. మరి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుంటారు. నచ్చకపోతే విడాకులు తీసుకుంటారు. మొత్తంగా రంగుల ప్రపంచంలో ప్రేమ.. పెళ్లి.. విడాకులు.. అనేవి అత్యంత సాధారణం.

అయితే కొందరు సినిమా తారలు మాత్రం కారణాలు ఏంటో తెలియదు కానీ.. పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్నే గడుపుతున్నారు. ఇంతకీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్న సినిమా తారలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

1.టబు
టాలీవుడ్ లో పలు హిట్ సినిమాలు చేసిన నటీమణి. తెలుగులోని టాప్ హీరోలు అందరితోనూ కలిసి నటించింది. బాలీవుడ్ లోనూ నటిగా చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె వయసు 50 సంవత్సరాలు. అయినా తను ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి మూలంగా తమ సంతోషాలను కోల్పోయే అవకాశం ఉంటుందని ఈమె అభిప్రాయం.

2.సుస్మితా సేన్
బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణి సుస్మితా సేన్. పెళ్లికి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. ఈమె వయసు కూడా 50 ఏండ్లు. పెళ్లి గురించి ఎవరు ఎన్ని విషయాలు చెప్పినా.. తను మాత్రం సింగిల్ గా ఉంటేనే సంతోషంగా ఉంటాననే ఫీలింగ్ ఉందని చెప్పింది.

3.శోభన
టాలీవుడ్ లో నటిగా, డ్యాన్స్ కళాకారిణిగా మంచి గుర్తింపు పొందింది శోభన. ఇప్పటికీ తను వివాహం చేసుకోకుండా ఒంటరి జీవితాన్నే గడుపుతుంది. ఈమె వయసు 51 సంవత్సరాలు. పెళ్లి మాత్రమే జీవితంలో సంతోషాన్ని ఇస్తుందనే విషయాన్ని తాను నమ్మనని చెప్పింది.

4.దివ్యా దత్త
ఈమె వయసు 43 సంవత్సరాలు. బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన జీవితంలో ఎంతో మంది మగాళ్లను చూసినా.. తనకు సరైన జోడీ అనే ఫీలింగ్ కలగలేదని వెల్లడించింది. అందుకే తాను ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని చెప్పింది.

5.అమీషా పటేల్
టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగింది అమీషా పటేల్. తెలుగులో పలు హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లోనే మంచి పేరు సంపాదించుకుంది. 46 ఏండ్లు నిండిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు.

6.నగ్మా
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది నగ్మా. హిందీ, కన్నడ, పంజాబీ, మరాఠీ సినిమాల్లోనూ నటించింది. ఈమె వయసు కూడా 46 ఏండ్లు నిండింది. అయినా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు.

7.సితార
తెలుగు సినిమా పరిశ్రమలో వెలుగు వెలిగిన నటి సితార. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతుంది. 40 ఏండ్లు దాటినా.. ఇప్పటికీ తను పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతుంది.































