Senior Journalist Bhardwaja : ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత ప్రభావం చూపిందో అందరికీ తెలుసు. అందులోనూ జక్కన్న డైరెక్షన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నటన సినిమాను మరో రేంజ్ లో నిలబెట్టాయి. అయితే వారి కష్టానికి ఫలితంగా నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఇంతవరకు ఆసియన్ పాటకు ఈ అవార్డు రావడం ఇదే తొలిసారి. అదీకాక మన ఇండియన్ సినిమా అందునా తెలుగు సినిమాకు రావడంతో అందరికీ ఈ అవార్డు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. గోల్డెన్ గ్లోబ్ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు నాటు నాటు పాటకు రావడంతో తెలుగు ప్రేక్షకులే కాకుండా అటు ఇండియన్స్ మొత్తం గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇది మరువక ముందే ఆస్కార్ కి కూడా నాటు నాటు పాట నామినేట్ అయిందనే విషయం తెలియడంతో మన ఆనందానికి హద్దులేకుండా పోయింది. అయితే ఆస్కార్ వరకు నాటు నాటు వెళ్లడానికి గల కారణాలను సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ వివరించారు.

అంతర్జాతీయ వేదికపై నాటు నాటు డాన్స్…
రాజమౌళి తీసిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్, సినిమాను కేవలం ఇండియాకే పరిమితం చేయకుండా రాజమౌళి వ్యూహత్మాకంగా అంతర్జాతీయ వేదిక మీద సినిమాను బాగా ప్రమోట్ చేసాడు. ఇక జపాన్ వంటి దేశాల్లో సినిమాను విడుదల చేసి సినిమాకు హైప్ తెచ్చారు. ఇక విదేశీ జర్నలిస్ట్లకు సినిమాను చూపించి అక్కడ ప్రచారం కల్పించాడు జక్కన్న. ఇలా అంతర్జాతీయ వేదిక మీద ఆర్ఆర్ఆర్ ను నిలపడానికి అయిన ఖర్చంతా జక్కన్నే భరించాడు అనే వార్త వినిపించింది. నిజానికి ఈ సినిమాకు ప్రొడ్యూసర్ దానయ్య అయినా అతను పైకి కనిపించే ప్రొడ్యూసర్, ఆయన వెనుక చిరంజీవి వంటి వారు ఉన్నారనేది బయట వినిపిస్తున్న మాట.

అయితే హాలీవుడ్ వరకు ఆర్ఆర్ఆర్ ను ప్రమోట్ చేయడానికి ఒక 50 కోట్లు ఖర్చు పెట్టుకున్నట్లు తెలుస్తుండగా ఆ డబ్బంతా రాజమౌళి, ఆయన హీరోలు చూసుకున్నారట. ఇక నిర్మాతగా దానయ్య ఎక్కడా ఆర్ఆర్ఆర్ టూర్లలో కనిపించలేదు. జక్కన్న తో పాటు శోబు యార్లగడ్డ ఉండటం విశేషం. తన మార్కెట్ ను పెంచుకోడానికి ఆర్ఆర్ఆర్ ను వాడుకుంటున్నారు జక్కన్న, అందుకోసం లాబీయింగ్ చేయడం తప్పు కాదంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు. ఇక నాటు నాటు పాట నామినేషన్స్ కి వెళ్లినందుకే సంబరాలు చేసుకున్నాం. ఇక కీరవాణి, చంద్రబోస్ లకు ఆస్కార్ కమిటీ నుండి ఫోన్ వచ్చి, సిద్ధంగా ఉండండి అని చెప్పడంతో ఆస్కార్ ఖాయం అయినట్లే ఆర్ఆర్ఆర్ కి అని వినిపిస్తోంది అంటూ భరద్వాజ తెలిపారు.































