Senior Journalist Imandhi Ramarao : ఏపీ రాజకీయాల్లో మహిళా నేతల్లో మీడియాతో బాగా వైరల్ అవుతున్న నేత మంత్రి రోజా. తాజాగా ఆమెకు వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీ నుండి టికెట్ ఇవ్వడం లేదనే వార్తల నడుమ జనసేన, టీడీపీలను హద్దు దాటి విమర్శించే రోజా గారి గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఆసక్తికర వాఖ్యలు చేసారు. ఆమె ఒక రాజకీయా నాయకురాలిగా ప్రవర్తించడం లేదంటూ ఫైర్ అయ్యారు.

ఒకప్పుడు ఇంటి అద్దె కట్టలేని స్థితి ఇపుడు 1000 కోట్ల ఇల్లు…
మంత్రి రోజా తాజాగా రజనీకాంత్ జైలర్ సినిమా వేడుకలో చేసిన వాఖ్యలను తనకి అనుకూలంగా మాట్లాడటం గురించి ఇమంది గారు మాట్లాడారు. మన వెనుక కుక్కలు మొరుగుతాయి అంటూ రజని చేసిన వాఖ్యలను రోజా జనసేన, టీడీపీ కి ఆపాదిస్తూ వారిని విమర్శించడం పట్ల ఇమంది గారు మాట్లాడుతూ ఆమె స్థాయి ఏమిటి రజని కాంత్ గారి స్థాయి ఏమిటి ఆయనకు ప్రపంచ దేశాల్లో అభిమానులు ఉన్నారు.

ఈమెకు మన రెండు తెలుగురాష్ట్రాలు, తమిళనాడు దాటితే ఈమె ఎవరో కూడ ఎవరికీ తెలియదు అలాంటిది ఆయన గురించి మాట్లాడే అర్హత రోజకి ఎక్కడిది అంటూ ఇమంది ఫైర్ అయ్యారు. జగన్ వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇస్తాడో లేదో అని ప్రతిపక్షాలను నోటికొచ్చినట్లు మాట్లాడి మీడియా లో నిత్యం ఉండాలని భావిస్తోంది. ఒకప్పుడు ఇంటి అద్దె కూడ కట్టలేని స్థితిలో ఉన్న ఆమె ఇపుడు 1000 కోట్ల ఇల్లు ఎలా కట్టుకుంది. ఇవన్నీ అడిగితే ఎం సమాధానం చెబుతుంది అంటూ ఇమంది గారు రోజా గారి గురించి మాట్లాడారు.