Senior Journalist Imandhi Ramarao : నవంబర్ 14న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన కృష్ణగారికి చికిత్స అందించిన వైధ్యులు చికిత్సకు ఆయన శరీరం స్పందించకపోవడం వల్ల ఆయనను ఇంకా ఇబ్బంది పెట్టకూడదని భావించి కృష్ణ గారి కుటుంబం చికిత్స ఇక వద్దు అనే నిర్ణయం తీసుకోవడం వల్ల నవంబర్ 15 తెల్లవారుజామున ఆయన మరణించారు. ఇక ఆయన అంతిమ యాత్ర విషయంలో కృష్ణ గారి అభిమానులు చాలా నిరాశ చెందారు. ఆయనను చివరిచూపు చూడాలని ఎక్కడినుండో వస్తే చూసే అవకాశం కల్పించలేదు. ఇక దహన సంస్కారాలు కూడా సాధారణ వ్యక్తికి చేసినట్లు మహాప్రస్థానంలో చేయడం పట్ల ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేసారు.

పెద్దకర్మ అయినా బుర్రిపాలెంలో చేయాల్సింది…
కృష్ణ గారి అంత్యక్రియల విషయంలో జరిగిన పొరపాట్లను గమనించి ఆయన పెద్ద కర్మ కార్యక్రమం అయినా ఆయన స్వగ్రామంలో ఆయన అభిమానుల సమక్షంలో చేయిస్తే బాగుంటుందని అభిమానులు అందరూ భావించారు. కానీ కృష్ణ గారి కుటుంబ సభ్యులు కృష్ణ కగారి పెద్ద కర్మను హైదరాబాద్ లోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ ఇష్యూ మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడుతూ మహేష్ బాబు బుర్రిపాలెంలో కార్యక్రమం నిర్వహించుంటే బాగుండేది కానీ అయన భార్య నమ్రత ఈ విషయంలో వ్యతిరేకించినట్లు వినిపిస్తోంది.

అక్కడ ఏర్పాటు చేస్తే జనాల హడావిడి సెక్యూరిటీ సమస్య వస్తుందని భావించి ఆవిడ నిరకరించారు అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. ఏదేమైనా పెద్ద కర్మ కార్యక్రమాన్ని సంబంధించిన నిర్ణయం పూర్తిగా కృష్ణ గారి కుటుంబ సొంత నిర్ణయం అలాగే వ్యక్తిగతం. ప్రభాస్ తన పెదనాన్న కృష్ణం రాజు కార్యక్రమం సొంతూరులో జరిపించిన కారణాలు వేరు, అక్కడ వాళ్ళే పెద్ద కుటుంబం. ఇక్కడ బుర్రిపాలెంలో ఇతర పెద్ద కుటుంబాలు కూడా ఉన్నాయి అందరినీ సమన్వయం చేసుకుని నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే మహేష్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లున్నారు అంటూ చెప్పారు.





























