Senior Journalist Imandhi Ramarao : అలనాటి అందాల తార తెలుగు తెర సత్యభామ జమున గారు మనల్ని వదిలి దివికేగి పోయారు. వృధాప్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. ఆమె భౌతికంగా మనకు దూరమైనా తెలుగు సినిమా ఉన్నంత కాలం మన మదిలో సజీవంగా ఉంటారు జమున. ఏ పాత్రలో అయినా ఒదిగిపోయి నటించే ఆమె అందరు అగ్రహీరోల సరసనా నటించి హీరోలకు సమవుజ్జిగా నిలబడ్డారు. అటు కెరీర్ లోనూ సక్సెస్ అయిన ఆమె ఇటు వ్యక్తిగత జీవితంలోనూ రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ సక్సెస్ చూసి అలాగే కుటుంబ పరంగాను బాగా సెటిల్ అయ్యారు. ఆమె వ్యక్తిగత విశేషాలను సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు వివరించారు.

మాట కోసం కోట్లు పోగొట్టుకున్న నటి…
జమున గారు ముక్కుసూటిగా మాట్లాడే తత్త్వం అంటూ ఇమంది గారు అభిప్రాయాపడ్డారు. నిండైన ఆత్మగౌరవం తో ఉండే జమున గారు ఒక మాట ఎవరికైనా ఇచ్చారంటే అది తప్పరు అంటూ తెలిపారు. చెన్నై లోని ఒక స్థలం మొదట 35 లక్షలకు ఇస్తానని మాటిచ్చినందుకు ఆ స్థలం కోట్లు విలువ చేసినా ఆమె మాటిచ్చానని 35 లక్షలకే అమ్మారట, ఆ స్థలం ప్రస్తుతం పది కోట్ల పైనే వాల్యూ ఉంటుందంటూ ఇమంది గారు తెలిపారు.

ఇక ఆమెకు పెద్ధ ఇల్లులు హైదరాబాద్, అలాగే చెన్నయ్ లోనూ ఉన్నాయని వెయ్యి కోట్ల ఆస్తులు ఆమెకు ఉన్నాయంటూ తెలిపారు. హీరోయిన్ గా కెరీర్ బాగా ఉన్న రోజుల్లో కూడా డబ్బు గురించి ఏనాడూ తాపత్రయపడలేదని, డబ్బు బాగా సంపాదిస్తున్న రోజుల్లోను ఆమెలో ఎలాంటి మార్పు ఉండేది కాదని, అంతే క్రమశిక్షణతో ఉండేవారని అందుకే ఆమె అంత ఆస్తి సంపాదించగలిగారంటూ చెప్పారు.
































