Senior Journalist Narra Vijay : కెసిఆర్ వచ్చే ఎన్నికలలో కామారెడ్డి నుండి పోటీ చేయడానికి కారణం అదే…: సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్

0
60

Senior Journalist Narra Vijay : తెలంగాణ లో అధికార పార్టీ బిఆర్ఎస్ అపుడే ఎన్నికల బరిలో నిలవబోయే అభ్యర్థుల జాబితాను విడుదల చేసి ఒక్కసారిగా షాకిచ్చింది. అంతేకాకుండా తెలంగాణ రాజకీయాన్ని హీటక్కించింది. ఒకవైపు సీఎం అభ్యర్థి ఎవరని కాంగ్రెస్, బిజెపి మల్లగుల్లాలు పడుతుంటే ఏకంగా బిఆర్ఎస్ అభ్యర్థులను 119 నియోజకవర్గాలకు ప్రకటించి ఆశ్చర్యపరిచింది. ఇక ఈసారి సీఎం కెసిఆరే మరోసారి తమ సీఎం అభ్యర్థి అంటూ ఆ పార్టీ క్లారిటీ కూడ ఇచ్చేసింది. అయితే ఈసారి కెసిఆర్ గజ్వేల్ నుండి మాత్రమే పోటీ చేయకుండా కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నారు. ఒకే నాయకుడు రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయడం కొత్త కాకపోయినా మూడో టర్మ్ కూడ ముచ్చటగా గెలవాలని చూస్తున్న గులాబీ బాస్ వ్యూహం ఏమిటన్నది ఇపుడు చర్చ. ఇక ఈ విషయం గురించి సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ ఆయన విశ్లేషణ అందించారు.

కెసిఆర్ కామారెడ్డి నుండి బరిలోకి…

ముఖ్యమంత్రి కెసిఆర్ మూడోసారి ముచ్చటగా సీఎం అవ్వాలని తన వ్యూహ రచనకు పదును పెట్టారు. ఎన్నికలకు ఇంకా 50 రోజుల పైనే సమయం ఉన్న అపుడే అభ్యర్థులను ప్రకటించి రాజకియంగా తానేంటో మరోసారి చూపించారు. అయితే ఆయన సొంత నియోజకవర్గం గజ్వేల్ నుండి కాకుండా ఆయన ఈసారి కామారెడ్డి నుండి కూడ పోటీ చేస్తున్నారు. దీనికి ఆయన అక్కడి నేతల ఒత్తిడి వల్లే పోటీ చేస్తున్నట్లు చెప్తున్నా వెనుక వేరే మతలబు ఉందని నర్రా విజయ్ అభిప్రాయపడ్డారు.

కామారెడ్డి నియోజకవర్గం లోనే కెసిఆర్ తల్లి గ్రామం ఉండటం ఒక కారణం అయితే మరో కారణం కామారెడ్డి నుండి కెసిఆర్ బరిలోకి దిగితే అటు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీం నగర్ ఈ మూడు జిల్లాల్లోనూ ఆ ప్రభావం ఉంటుంది . అందుకే ఈ నిర్ణయం కెసిఆర్ తీసుకుని ఉండవచ్చు అంటూ విజయ్ తెలిపారు. సిఎం కి గజ్వేల్ లో గెలవడం నల్లేరు మీద నడకే అయినా కామారెడ్డి ఎంచుకోవడం వెనుక రాజకీయా ప్రయోజనం ఉందని తెలిపారు. అయితే ప్రతిపక్షలు ఈ సారి కెసిఆర్ గజ్వేల్ లో గెలవడం కష్టమని కెసిఆర్ కు తెలిసిపోయింది అందుకే కామారెడ్డికి షిఫ్ట్ అయ్యాడు అంటూ విమర్శలను గుప్పిస్తున్నారు.