Senior Producer Chittibabu : కుప్పంలో జరిగిన లోకేష్ పాదయాత్రలో పాల్గొని అక్కడే గుండె పోటు రావడంతో 23 రోజులుగా బెంగళూరు లోని నారాయణ హృదయాలయలో చికిత్స అందుకుంటూ చివరికి మరణించిన నందమూరి తారకరత్న ఆయన కుటుంబానికి తీరని బాధను మిగిల్చారు. ముఖ్యంగా ముగ్గురు పిల్లలను ఆయన భార్య అలేఖ్య రెడ్డిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తారకరత్న ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా ప్రేమకు విలువనిచ్చి స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. దీంతో కన్నవాళ్లకు దూరమాయ్యాడు. అయితే ఇప్పుడిప్పుడే బాబాయ్ బాలకృష్ణ ద్వారా మళ్ళీ కుటుంబంలోకి కలవబోతున్న తారకరత్నను మృత్యువు కబళించింది. తారకరత్న గారికి ముగ్గురు పిల్లలు కాగా పెద్దమ్మాయి నిషిక కు నాన్నతో ఎక్కువ బాండింగ్ ఉండటం వల్ల తన బాధను ఆపడం ఎవరి తరం కావడం లేదంటూ సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు అభిప్రాయపడ్డారు.

పుట్టినరోజు నాడే చిన్న కర్మ…
తారకరత్న గారు మరణించి నిన్నటికి మూడు రోజులు అవడంతో చిన కర్మను జరిపించగా అదే రోజు తారకరత్న గారి పుట్టినరోజు కావడం దురదృష్టకరం. పుట్టినరోజు నాడు నాన్న ఎందుకు లేడో చిన్న పిల్లలకు అర్థం కాకపోగా పెద్దమ్మాయి నిషిక మాత్రం తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది. తారకరత్న ఫోటో దగ్గర కూర్చొని తండ్రి ని చూస్తూ ఏడ్చడం అందరినీ కదిలించింది అంటూ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు తెలిపారు.

ఎనిమిదేళ్ల వయసున్న నిషిక కు తండ్రితో ఎక్కువ అనుబంధం ఉండటం నాన్న ఇక తిరిగి రాడు అన్నది తెలియడం వల్ల తన బాధని ఆపడం ఎవరి తరం కావడం లేదని చెప్పారు. ఇక తారకరత్న పిల్లలను చాలా బాగా చూసుకునేవాడని ఇంట్లో ఎక్కువగా పిల్లలతో గడిపేవాడంటూ, ఎంత డబ్బు ఉన్నా తండ్రి లేని లోటు ఎవరూ తీర్చలేరంటూ అభిప్రాయపడ్డారు.































