Bigg Boss 8: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ఇప్పటివరకు తెలుగులో ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ ప్రారంబానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇక త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు విషయాలను కూడా అధికారికంగా తెలియచేయునున్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు చివరి వారంలోన లేదా సెప్టెంబర్ మొదటి వారంలోని ప్రసారం కావడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయిందని సమాచారం.
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెడ్ లకు సంబంధించి తరచూ ఎన్నో రకాల వార్తలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ కార్యక్రమంలో ఒక సీనియర్ హీరో కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. ఇటీవల కాలంలో పలువురు సీనియర్ సెలబ్రిటీలు బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
వినోద్ కుమార్..
ఈ క్రమంలోనే సీనియర్ హీరోగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటుడు వినోద్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. ఈయన ఇటీవల రాజధాని ఫైల్స్ సినిమా ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా మంచి సక్సెస్ అవ్వడం కోసమే వినోద్ కుమార్ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.



























