AP: ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు అధికారంలోకి రావడం కోసం పెద్ద ఎత్తున ప్రజలకు ఇచ్చే హామీలన్నీ కూడా ఉచిత హామీలనే ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాము అధికారంలోకి రావాలి అంటే ఉచితంగా ఇసుక ఇస్తాం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కల్పిస్తాము అంటూ ఇటీవల కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో పాటు గత ప్రభుత్వంలో కూడా కొన్ని పథకాలను పేదలకు ఉచితంగా ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఇలా అధికారంలోకి రావడం కోసం రాజకీయ నాయకులు ఉచిత హామీలను ప్రకటించడం పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు పరిపాలనలో ఉచితం అనే పదాన్ని తీసేయాలని తెలిపారు..
ప్రజలకు ఏదైనా మౌలిక వసతులు కల్పించేలా పరిపాలన సాగించాలి అలాగే జీవనోపాధిని చూపెడుతూ పరిపాలన సాగించాలి కానీ రాజకీయ నాయకులే ఉచితం అని పదాన్ని ప్రజలకు అలవాటు చేస్తున్నారని తెలిపారు.ఉచిత పథకాలను వ్యతిరేకించే వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారని కడుపు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉచిత పథకాల మీద కోపంగానే ఉంటారు అంటూ తెలిపారు.
ఉచితం అనే పదాన్ని తొలగించాలి..
ఇలా వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేయడంతో పలువురు ఈయన వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నారు. వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడుకి అత్యంత ప్రాణ స్నేహితుడు. మరి ఈయన చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చే సమయంలో ఇది తప్పు అని ఎందుకు సలహా ఇవ్వలేదు అంటూ ప్రశ్నిస్తూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను తీసుకువస్తూ ఆయా వృత్తుల వారికి ఆసరా కల్పించారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం అన్ని ఉచితమనే హామీలను ఇస్తూ అధికారంలోకి వచ్చారు అంటూ ఈయన వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.


































