ఆఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల ఆగడాలు తారాస్థాయికి చేరాయి. దాదాపు దేశం మొత్తం స్వాధీనం చేసుకున్నారు. కొన్ని దేశాల అండదండలతో వారు ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి వెళ్లిపోయారు. దీంతో అక్కడ అరాచకపాలన మొదలైంది. సైనికుడు, పౌరుడు అనేది చూడకుండా ఇష్టం వచ్చినట్లు దాడులకు పాల్పడుతున్నారు. మహిళల విషయానికి వస్తే బలవంతపు పెళ్లిలు, లైంగిక దాడులు చోటుచేసుకుంటున్నాయి.

అయితే ప్రస్తుతం ఆఫ్గనిస్థాన్‌లో జరుగుతోన్న పరిమాణాలపై ప్రతీ ఒక్కరు చర్చించుకుంటున్నారు. అమెరికా సైన్యాలు ఆఫ్గన్‌ను వీడడంతో తాలిబన్లు రెచ్చిపోయారు. ఇక అక్కడ చిక్కుకున్న విదేశియలు వారితో పాటు స్వదేశీయులు కూడా దేశాన్ని విడిచి వెళ్లేందుకు ఏ చిన్న అకకాశం దొరికినా ఉపయోగించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే కాబూల్ నగరంలోని ఇంటర్‌నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి విదేశాలకు వెళుతోన్న విమానాల రెక్కలపై వేలాడుతూ వెళుతోన్న దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంటున్నాయి. ఇదిలా ఉంటే సుమారు 20 ఏళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న తాలిబన్లు మళ్లీ అధ్యక్ష పీఠాన్ని హస్తగతం చేసుకోవడంతో రచ్చ చేస్తున్నారు. అధ్యక్ష భవనంలో వారు చేస్తున్న హంగామా అంతాఇంతా కారు. అయితే టాలీవుడ్ లో కాట్రవర్సీటీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ తాలిబన్ల వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు.
తాలిబన్లు అధ్యక్ష భవనంలో చేతిలో ఆయుధాలు పట్టుకొని జాల్సాలు చేస్తున్న తాలిబన్లకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.. ‘వాళ్లు ఎలాంటి జంతువులనేది ఇది చూస్తేనే అర్థమవుతుందని’ క్యాప్షన్ రాసుకొచ్చారు. అక్కడ ప్రతీ ప్రాంతాన్ని తమ హస్తగతం చేసుకున్న తాలిబన్లు కాబుల్ లోని ఓ ఎమ్యూజ్ మెంట్ పార్కులో ఎలక్ట్రిక్ కార్లలో కూర్చొని చిన్న పిల్లలులాగా ఆడారు. ఆ వీడియోను ఆర్జీవీ షేర్ చేస్తూ.. ఇది నిజమే.. తాలిబన్లు చిన్ని పిల్లలు అంటూ స్పందించారు. అయితే ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా పాజిటివ్ గా స్పందించారు.






























