Serial Actress: బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతోమంది విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇలా హిందీ తెలుగు కన్నడ సీరియల్స్ ద్వారా ఎంతో మంది సెలెబ్రిటీలు మనకు సుపరిచితమే. ఈ క్రమంలోనే హిందీ సీరియల్ బడే అచ్చే లాగ్తే హై సీరియల్ నటి దిశా పర్మార్ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.

ఈమె ఈ సీరియల్ తో పాటు మరికొన్ని సీరియల్స్ లో నటిస్తూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు.ఇలా బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె గత ఏడాది సింగర్ రాహుల్ వైద్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట వీరి ఆనంద క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

ఇకపోతే వీరి వివాహం జరిగి ఒక ఏడాది పూర్తి కావడంతో వీరి వివాహ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇకపోతే ఈ నటి ప్రస్తుతం తన భర్తతో కలిసి లండన్ వెకేషన్ వెళ్లారు. లండన్ లో వీరి మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవాలని కోసం వెళ్లారు. ఇలా లండన్ పైన ఈ జంట ఫ్లైట్లో ఎంతో రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోయారు.
మరో ఏడు జన్మలకు నువ్వే నా భార్య కావాలి…
ఫ్లైట్లో ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించుకుంటూ రొమాంటిక్ ఫోటోలకు ఫోజులిచ్చారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఇక ఈ ఫోటోలను షేర్ చేస్తూ తన భార్య పట్ల ఒక స్పెషల్ నోట్ రాశారు. అప్పుడే మన పెళ్లి జరిగి ఏడాది పూర్తీ అయింది. నీలాంటి జీవిత భాగస్వామి దొరకడం అదృష్టం ఈ జన్మకే కాదు మరో ఏడు జన్మలకు నువ్వే నా జీవిత భాగస్వామి కావాలి ఐ లవ్ మై వైఫ్ అంటూ తన భార్య గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే వీరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



























