Serial Actress Jyothireddy : దాదాపు ముప్పై ఏళ్లుగా బుల్లితెర మీద సీరియల్స్ లో కనిపిస్తూ అటు నెగెటివ్ పాత్రలను ఇటు పాజిటివ్ పాత్రలను చేస్తూ అలరిస్తున్న నటి జ్యోతి రెడ్డి. ప్రస్తుతం పలు సీరియల్స్ లో బిజీగా ఉన్న జ్యోతి రెడ్డి తాజాగా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె వ్యక్తిగత, కుటుంబ విషయాలను పంచుకున్నారు. ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి ఆమె ఏపీ మాజీ సీఎం మానవరాలని చెప్పి షాకిచ్చారు జ్యోతి రెడ్డి.

మా తాతయ్య సీఎం…
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం భవనం వెంకటరామిరెడ్డి గారి మనవరాలు జ్యోతి రెడ్డి గారు. అయితే ఈ విషయం ఎక్కడా చెప్పుకోలేదు ఆమె. ఆమె పెదనాన్న గారు రెండు సార్లు తెనాలి ఎమ్మెల్యేగా పనిచేసారు, ప్రస్తుతం తన కజిన్ కూడా రాజకీయాల్లో ఉన్నారంటూ తెలిపారు జ్యోతి రెడ్డి. అయితే జ్యోతి రెడ్డి గారి తండ్రికి రాజకీయాల కన్నా చదువంటే ఎక్కువ ఇష్టం ఉండటం వల్ల ఆయన బాగా చదువుకుని బిఎస్ఎన్ఎల్ లో గ్రేడ్ వన్ ఆఫీసర్ గా పనిచేశారట.

ఇక జ్యోతి రెడ్డి గారు చదువులో బాగా చురుగ్గా ఉండేవారట. డిగ్రీ, ఎంఏ, ఎంఫిల్ ఇలా అన్నింటా కాలేజీ ఫస్ట్ అలాగే గోల్డ్ మెడలిస్ట్ గా వరుసగా వచ్చారు. చదువుయ్యాక ఉద్యోగం చేయాలని అనుకున్నా ఆమె 9 ఏళ్ల వయసునుండే నటనలో రాణించడం వల్ల అవకాశాలు ఎక్కువగా రావడంతో చదువుయ్యాక మళ్ళీ టీవీ రంగములోకి వచ్చారు. ఇక భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగి అవడం వల్ల ఎపుడూ ఒక చోట ఉండరని కొన్నాళ్ళు చెన్నై, మరి కొంతకాలం సింగపూర్ అలా ఉండాల్సి వచ్చేది. ఇక మాకు ఇద్దరు అబ్బాయిలు యశ్వంత్, అభిరామ్ అంటూ చెప్పారు. పెద్ధబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చేస్తుండగా, చిన్నబ్బాయి 8 వ తరగతి చేస్తున్నాడు అంటూ చెప్పారు జ్యోతి రెడ్డి.
































