Actress Srivani: బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి శ్రీవాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు.ఈ విధంగా నిత్యం తన భర్త కూతురుతో కలిసి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను పంచుకొనే బుల్లితెర నటి శ్రీ వాణి మాట మూగబోయింది.

నిత్యం ఏదో ఒక వీడియో ద్వారా గలగల మాట్లాడుతూ అభిమానులను సందడి చేసే ఈమె వాయిస్ లో గత కొన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి. అయితే కేవలం జలుబు కారణంగా తన గొంతు మారిపోయిందని శ్రీవాణి కూడా పలు వీడియోలలో తెలియజేశారు. అయితే రోజురోజుకు ఈమె మాట పలకడానికి కూడా కష్టంగా మారడంతో శ్రీవాణి వైద్యుని సంప్రదించారు.

ఈ క్రమంలోనే హైదరాబాదులో కేర్ హాస్పిటల్ లో పరీక్షలు చేయించుకున్న ఈమె రిపోర్ట్స్ వచ్చిన అనంతరం తన హెల్త్ కండిషన్ గురించి తన భర్త విక్రమ్ మాట్లాడుతూ శ్రీవాణి పరిస్థితి కాస్త సీరియస్ గానే ఉంది అంటూ షాక్ ఇచ్చారు. ఈమె షూటింగ్ సమయంలో గట్టిగా అరవడం మాట్లాడటం వల్ల తన ఓకల్ కార్డ్స్ ఇన్ఫెక్షన్ కి గురై ఉబ్బిపోయాయని వెల్లడించారు.
నెలరోజులపాటు మాట్లాడకూడదన్న డాక్టర్లు…
ఈ విధంగా ఓకల్ కార్డ్స్ ఇన్ఫెక్షన్ కావడం వల్ల తనకు మాట రావడం లేదని డాక్టర్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే తనకు ఇన్ఫెక్షన్ తగ్గాలి అంటే ఒక నెలపాటు శ్రీవాణి మాట్లాడుకూడదని మాట్లాడితే కనుక తనకు జీవితంలో మాట రాకపోవచ్చు అని డాక్టర్లు వెల్లడించినట్లు విక్రమ్ తెలిపారు. నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే తిరిగి తనకు మాట వచ్చే అవకాశం ఉందని ప్రస్తుతం తన పరిస్థితి సీరియస్ గానే ఉందని విక్రమ్ అసలు విషయం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.


































