Serial Actor: సినిమా అయినా, సీరియల్ అయినా షూటింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరగాలంటే షూటింగ్ లొకేషన్లో ప్రతి ఒక్కరు టెక్నీషియన్ల నుంచి మొదలుకొని నటీనటుల వరకు అందరూ ఎంతో సాన్నిహిత్యంగా కలిసిమెలిసి ఉంటేనే అనుకున్న సమయానికి అనుకున్న పనులను సజావుగా జరుగుతాయి. అయితే ఇండస్ట్రీలో చాలామంది ప్రతి ఒక్కరితోనూ ఎంతో మంచిగా ఉంటారు. స్టార్ హీరో హీరోయిన్ అనే గర్వం లేకుండా టెక్నీషియన్ల నుంచి ప్రతి ఒక్కరితో ఎంతో మంచిగా మెలుగుతూ ఉంటారు.

ఇకపోతే వారి స్టేటస్ దృష్టిలో పెట్టుకొని టెక్నీషియన్లు ఇతర యూనిట్ మెంబర్స్ పై దురుసుగా మాట్లాడిన ప్రవర్తించిన యూనిట్ సభ్యులు సైతం తమదైన శైలిలో సమాధానం చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బుల్లితెర హీరోకు టెక్నీషియన్ల నుంచి ఈ విధమైనటువంటి అనుభవం ఎదురయింది.
స్టార్ మా లో ప్రసారం అవుతున్న సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ ద్వారా పరిచయమైన నటుడు చందన్ గురించి పరిచయం అవసరం లేదు ప్రస్తుతం ఈయన స్టార్ మా లో ప్రసారమవుతున్న శ్రీమతి శ్రీనివాస్ అనే సీరియల్ కూడా నటిస్తున్నారు. ఈ సీరియల్స్ చిత్రీకరణ సమయంలో ఈయన ఒక టెక్నీషియన్ పై దురుసుగా ప్రవర్తించారు. ఏకంగా తల్లిని ఉద్దేశిస్తూ బండబూతులు తిట్టడంతో టెక్నీషియన్స్ ఏకమై ఇతనిపై తిరగబడ్డారు.

Serial Actor: నటుడిపై చేయి చేసుకున్న టెక్నీషియన్స్…
ఈ విధంగా టెక్నీషియన్ల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఈ నటుడిపై ఏకంగా చేయి చేసుకున్నారు. ఇలా టెక్నీషియన్లను చిన్నచూపు చూస్తూ వారిని బూతులు తిట్టడంతో తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఇలా టెక్నీషియన్లు తనపై చేయి చేసుకోవడంతో ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే ఈయన సీరియల్స్ లో మాత్రమే కాకుండా పలు సినిమాలలో కూడా నటించారు.































