ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే డ్రగ్స్ కేసులో భాగంగా ఆర్యన్ అరెస్టు కావడంతో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఆర్యన్ కు మద్దతుగా నిలబడ్డారు. ఈ క్రమంలోనే అతనిని అరెస్టు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అతనికి బెయిల్ రాకుండా ఎన్సీబి అధికారులు తమ వాదనను తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం షారుక్ ఖాన్ హైకోర్టుకు వెళ్లారు.

ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ మేనేజర్ పూజ దడ్లానీ ఆర్యన్ బెయిల్ విచారణ పై పలుమార్లు కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే చాలా మంది నెటిజన్లు అసలు ఈ పూజ ఎవరు అంటూ ఆమె గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే గతంలో ఆర్యన్ ఖాన్ గురించి పూజ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2012వ సంవత్సరం నుంచి పూజ షారుఖాన్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. అయితే ఆర్యన్ 19 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆమె అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు… తన తండ్రి తెలివి తల్లిలా అందరితో కలిసిపోయే లక్షణాలు ఉన్నటువంటి మంచి హృదయం సున్నితమైన మనస్తత్వం కలిగిన ఆర్యన్ ఖాన్ టీనేజ్ దాటిన అందుకు అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ కేసు బెయిల్ విచారణలో భాగంగా ఈమె కోర్టుకు పలుమార్లు హాజరవుతూ కేసును తారుమారు చేసే ప్రయత్నం చేస్తోంది అంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే అధికారులు అతనికి బెయిల్ ఇవ్వకూడదని కోర్టులో విన్నవించుకున్నట్లు తెలుస్తోంది.




























