Shaheen Shah Afridi: ఇండియా, పాకిస్థాన్ ల మధ్య మ్యాచ్ అంటేనే అందరినీ విపరీతమైన క్రేజ్. దాయాదుల మ్యాచ్ చూడటానికి క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో రెండు టీంలకు సంబంధించి ఎలాంటి పొరపాటు జరిగినా ఫ్యాన్స్ భగ్గుమంటారు. మరీ ముఖ్యంగా పాక్ క్రికెటర్లు ఇండియా విషయంలో ఏదైనా చేస్తే మాత్రం టీమిండియా అభిమానులు ఆవేశంతో ఊగిపోతారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి టీమిండియా అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.

తాజాగా పాక్ క్రికెటర్ షాహిన్ షా అఫ్రిది చేసిన పని టీమిండియా అభిమానుల ఆగ్రహం తెప్పించింది. ఓ అభిమాని అఫ్రిది ఆటోగ్రాఫ్ అడగగా అతడు తన ఆటోగ్రాఫ్ పెట్టాడు. అయితే అతడు ఆటోగ్రాఫ్ చేయడంలో తప్పులేదు కానీ అతడు ఆటోగ్రాఫ్ ఎక్కడ పెట్టాదో అది ఆగ్రహం తెప్పిస్తోంది. అఫ్రిది తన ఆటోగ్రాఫ్ ని భారత జాతీయ జెండా మీద పెట్టడం వివాదమైంది. ఒక జాతీయ జెండా మీద ఆటోగ్రాఫ్ పెట్టడం ఏంటని అందరూ మండిపడుతున్నారు.
అఫ్రిది అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులు ఆడుతున్న క్రీడాకారుడు. మరి అలాంటి క్రీడాకారుడు జాతీయ జెండాల విషయంలో కొన్ని తప్పనిసరి విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏ దేశానికి చెందిన జాతీయ జెండాని అయినా ఖచ్చితంగా గౌరవించాల్సి ఉంటుంది. జాతీయ జెండాల మీద ఎలాంటి రాతలు ఉండకూడదు. కానీ అఫ్రిది మాత్రం భారత జాతీయ జెండా మీద ఆటోగ్రాఫ్ ఇవ్వడం వివాదం రేపింది.

Shaheen Shah Afridi: కనీసం తెలుసుకోవాలి కదా?
భారత జాతీయ జెండా విషయంలో జాతీయ జెండా ప్రతిష్టకు అవమానం కలిగించే ఎలాంటి చర్యలు చేపట్టకూడదు. ఇలాంటివి చేస్తే భారత జాతీయ ప్రతిష్ట అవమాన నిరోధక చట్టం-1971, భారత పతాకస్మ్కృతి-2002 ప్రకారం శిక్షార్హులు. అలాగే ఫ్లాగ్ కోడ్ 2022 నియమాలను కూడా తప్పకుండా పాటించాలి. అఫ్రిది విదేశీ క్రీడాకారుడు కాబట్టి అతడికి ఈ రూల్స్ తెలియకపోవచ్చు కానీ ఒక దేశానికి చెందిన జాతీయ జెండాను గౌరవించాలనే కనీస ఇంగిత జ్ఞానం అయితే ఉండాలి కదా అని టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. అదే సమయంలో పాక్ క్రికెటర్ చేతికి ఇండియన్ ఫ్లాగ్ ఇచ్చిన అభిమానిది కూడా తప్పుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.





























