Shahrukh Khan: నయనతార తో ప్రేమలో పడ్డారా అంటూ షారుక్ ను ప్రశ్నించిన నేటిజన్… హీరో సమాధానం ఇదే?

0
39

Shahrukh Khan: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. పఠాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినటువంటి ఈ హీరో త్వరలోనే జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడి వచ్చే నెల విడుదల కానుంది.

ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో నయనతార షారుఖ్ ఖాన్ జంటగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.ఈ సినిమా ద్వారా నయనతార బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా ఈ సినిమాపై భారీగానే అంచనాలను పెంచేసింది. ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియా వేదికగా నటుడు షారుఖ్ ఖాన్అభిమానులతో సరదాగా ముచ్చటించారు. అయితే ఒక నెటిజన్ మాత్రం ఈయనని ప్రశ్నిస్తూ మీరు ఈ సినిమా షూటింగ్ సమయంలో నయనతారతో ప్రేమలో పడ్డారా అంటూ ప్రశ్నించారు. ఇలా నేటిజన్ ప్రశ్నించడంతో షారుక్ తన స్టైల్ లో సమాధానం చెప్పారు.

Shahrukh Khan: ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి…


ఈ సందర్భంగా నేటిజన్ అడిగిన ప్రశ్నకు షారుఖ్ ఖాన్ సమాధానం చెబుతూ… నోర్మూయ్..ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి అంటూ నయనతార గురించి సమాధానం చెప్పారు. ఇలా షారుఖ్ ఖాన్ ఈ ప్రశ్నకు తన స్టైల్ లో సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా సదరు నేటిజెన్ కి దిమ్మ తిరిగింది. ఇక షారుఖ్ ఖాన్ చాలా సీనియర్ హీరో,నయనతార కూడా ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ వీరి గురించి నేటిజన్ అలాంటి ప్రశ్న వేయడంతో షారుక్ తన స్టైల్లో సమాధానం చెప్పాల్సి వచ్చింది.