Pallavi Prashanth: బిగ్ బాస్ కార్యక్రమంలో కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా పల్లవి ప్రశాంత్ కంటెస్టెంట్ గా పాల్గొని అనంతరం విజేతగా బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న పల్లవి ప్రశాంత్ గురించి బిగ్ బాస్ కంటెస్టెంట్ నటి షకీలా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ నేను హౌస్ లో ఉన్నప్పుడు ప్రియాంక, అమర్, సందీప్ మాస్టర్, దామిని ఈ నలుగురు మాత్రమే మంచిగా కనిపించారు. వీరిలో నిజాయితీగా కనిపించింది. ఇక శివాజీ న్యూట్రల్ గా ఉంటారని తెలిపారు. అయితే పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్లవి ప్రశాంత్ పైకి కనిపించే అంత మంచివాడు కాదని తెలిపారు.
హౌస్ లోకి వచ్చినప్పుడు పిల్లి లాగా ఉన్న ఆయన కొంచెం పాపులారిటీ రాగానే ఆటిట్యూడ్ చూపించారని తన ముందు సీనియర్ ఆర్టిస్టులు ఉన్న లెక్కచేయకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చునే వారని తెలిపారు. తనకంటే పెద్దవారి గురించి కూడా చాలా పొగరుగా మాట్లాడే వారని తన కళ్ళు నెత్తికెక్కాయి అంటూ ప్రశాంత్ గురించి ఈమె మాట్లాడిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
నాగార్జునకు మాత్రమే లాభం..
ఇక బిగ్ బాస్ కార్యక్రమం వల్ల నాకు వచ్చిన లాభమేమీ లేదు. వాళ్ళు పేమెంట్ ఇచ్చారు… నేను వెళ్ళాను. పాపులారిటీ కోసమే నన్ను హౌస్ లోకి తీసుకున్నారు. వారి అవసరం తీరిపోగానే నన్ను బయటకు పంపించారని తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల ఎవరికి లాభం అంటే నాగార్జునకు మాత్రమే లాభమని ఎందుకంటే స్టూడియో ఆయనదే హోస్ట్ కూడా ఆయనే కనుక నాగార్జునకు తప్ప ఎవరికి లాభం ఉండదు అంటూ షకీలా చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.



























