Shanmukh-Deepthi Love Break Up: యూట్యూబ్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు షణ్ముఖ్ జశ్వంత్. టైటిల్ ఫేవరేట్ గా బిగ్ బాస్ హౌస్ లో కి ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్.. సిరితో హగ్గింగులు, కిస్సులతో రన్నర్ గా నిలిచాడనే టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి మధ్య రొమన్స్ స్నేహం కారణంగానే.. సన్నీకి కలిసి వచ్చిందని.. దీంతో అతడు టైటిల్ కొట్టాడని.. లేకపోతే.. సన్నీకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే షణ్ముఖ్ బయటకు వచ్చిన తర్వాత అతడి లవర్ దీప్తి సునయనా.. అతడితో కలిసింది లేదు. కనీసం మాట్లాడింది కూడా లేదు. వెల్ కమ్ ఫంక్షన్ కు కూడా రాలేదు. ఇక ఇన్ని రోజులు కామ్ గా ఉన్న దీప్తి.. షణ్ముఖ్ కి 2021 ఎండ్ లో బిగ్ షాక్ ఇచ్చింది.

అంతకముందు నుంచే ఆమె సోషల్ మీడియాలో షణ్ముఖ్ ని అన్ ఫాలో చేసింది, తర్వాత రకరకాలుగా పోస్ట్ లు పెట్టింది. తాజాగా ఆమె 2022 కి వెల్ కమ్ చెబుతూ షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసింది. సోషల్ మీడియాలో దీప్తి సునయన షణ్ముఖ్ తో బ్రేకప్ విషయాన్ని నిర్దారించింది. ఇక తామిద్దరూ విడిపోతున్నట్టుగా ప్రకటించింది.
Shannu – Deepthi Break Up : దీప్తి నిర్ణయంపై షణ్ముఖ్ స్పందన ఏంటీ..?
ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో ఇలా రాసుకొచ్చింది. ‘‘ఎంతో ఆలోచించి.. మాట్లాడుకున్న తర్వాత తాను, షణ్ముఖ్ ఈ నిర్ణయం తీసుకున్నామని.. పరస్పర అంగీకారంతో విడిపోయి వ్యక్తిగతంగా జీవించాలనుకుంటున్నాం. ఇకపై ఎవరి దారిలో వాళ్లం వెళ్దామని నిర్ణయించుకున్నాం అని చెప్పింది. అంతే కాదు.. ఐదేళ్లలో ఎంతో ఆప్యాయంగా ఉన్నాం.. కానీ మాలోని రాక్షసులతో పోరాడటం కష్టంగా ఉంది.. అందుకే విడిపోతున్నాం అంటూ చెప్పింది. తమకి ఇంతవరకు సపోర్ట్ చేసిన సన్నిహితులకు, స్నేహితులకు థాంక్స్’’ చెబుతున్నట్టుగా పోస్ట్ పెట్టింది దీప్తి సునయనా. దీనిపై నెటిజన్లు కూడా దీప్తి వైపే మాట్లాడుతున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నావు.. మీరు మీ నిర్ణయానికి కట్టుబడి ఉండండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై షణ్ముఖ్ స్పందిస్తూ.. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని, ఐదు సంవత్సరాల నుంచి తనకు సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ తను ఆనందంగా ఉండాలని షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునైనా పోస్ట్ కి రిప్లై ఇచ్చారు.
































