బిగ్ బాస్ తెలుగు 5 లో షణ్ముఖ్ జస్వంత్ ప్రస్తుతం ఇంట్లో ఉన్న బలమైన కంటెస్టెంట్‌లలో ఒకరు. గ్రాండ్ ఫినాలేకి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో, బిగ్ బాస్ తెలుగు 5 ఫైనల్‌కు చేరిన ఇద్దరు ఫైనలిస్టులలో షణ్ముఖ్ తప్పకుండా ఉంటాడని టాక్ వినిపిస్తోంది.

అతని ప్రసిద్ధ వెబ్ సిరీస్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ స్మాష్ హిట్ తర్వాత.. షణ్ముఖ్‌కు కొన్ని ఆఫర్‌లు వచ్చాయి. ఈ లోపు అతడు హౌజ్ లోకి వెళ్లడంతో అవి స్క్రీన్ పైకి రాలేదు. ఒక ప్రముఖ చిత్రనిర్మాత తన చిత్రంలో షణ్ముఖ్‌ను కథానాయకుడిగా ఎంపిక చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా.. హౌజ్ లో సిరి, షణ్ముఖ్ రొమాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
వాళ్ల హగ్ లకు సంబంధించి సిరి తల్లి కూడా అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే సిరి కోసం.. మొదటి నుంచి షణ్ముఖ్ స్టాండ్ తీసుకుంటున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవల ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లో ఎంట్రీ తర్వాత.. వేదికపై కూడా కొంతమంది వచ్చారు. అందులో సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా వచ్చాడు. అప్పడు టాప్ 5 లో ఎవరు ఉంటారనేది అడగ్గా.. అతడు సన్నీ టాప్ లో పెట్టాడు.
దీంతో ఆ విషయాన్ని షణ్ముఖ్.. హౌజ్ లో సిరి ముందు ప్రస్తావించాడు. నీకోసం ఇంత వరకు స్టాండ్ తీసుకుంటున్న విషయం శ్రీహాన్ కు తెలియదా.. వేరే వాళ్లకు శ్రీహాన్ ఎలా సపోర్టు చేస్తాడు అంటూ ఫైర్ అయ్యాడు. హగ్గివ్వడం తప్పయితే ఇదేంటి.. అంటే ఇదంతా ఓకేనా? ఈ ఇంట్లో నీకు తప్ప ఏ అమ్మాయికి స్ట్రయిట్ హగ్గివ్వలేదు’ అని చెప్పుకొచ్చాడు. హౌజ్ లో జరిగేవి అన్నీ.. నీ చోటుకు తెలియదు. వెళ్లి చెప్పు.. అంటూ సిరిపై ఫైర్ అవుతాడు.































