బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. 99వ ఎపిసోడ్ లో హౌజ్ లోని తమ జర్నీని శ్రీరామచంద్ర, మానస్ కు సంబంధించినవి చూపించారు. ఇక 100వ ఎపిసోడ్ లో సన్నీ మరియు షణ్ముఖ్ కు సంబంధించిన వీడియోలు చూపించారు.

హౌజ్ లో కొనసాగిన జర్నీని చూసి షణ్ముఖ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. స్నేహితులకు మీరు ఇచ్చిన విలువ.. ఇక వారితో ఏమైనా మనస్పర్థలు వచ్చినప్పుడు మీరు మోసిన బరువుని బిగ్ బాస్ గమనించారని చెప్పారు. మీకు దగ్గరైన వాళ్ల కోసం.. మీరు చూపించిన ప్రేమ, తెగువ.. మీరు చూపించిన తీరు బిగ్ బాస్ గమనించారని అనగానే షణ్ముఖ్ కళ్లల్లో కన్నీరు చెమ్మగిల్లాయి.
ఇక ఈ హౌజ్ లో ఎక్కువగా మీకు నచ్చిన ప్లేస్ మోజ్ రూం అని.. అది బిగ్ బాస్ గమనించాడని అన్నారు. ఇక అతడి కోసం ప్లే చేసిన వీడియోలో ఎక్కువగా అతడు సిరితో స్పెండ్ చేసిన క్షణాలే కనిపించాయి. కొన్ని సందర్భాల్లో సన్నీ.. షణ్ముఖ్ ను ఆవేశపూరితంగా అన్న మాటలను కూడా చూపించారు. వీడియో చూస్తున్నంత సేపు షణ్ముఖ్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆమె తల్లి హౌస్ లోకి అడుగుపెట్టిన సీన్ కూడా చూపించారు.
ఇక వీడియో అయిపోయిన తర్వాత మీకు నచ్చిన ఫొటోను ఒకటి తీసుకెళ్లొచ్చు అంటూ చెప్పిన బిగ్ బాస్.. తన తల్లితో కలిసి ఉన్న ఫొటోని తీసుకుని వెళ్లాడు షణ్ముఖ్. దాంతో పాటు మరో ఫొటో కూడా తీసుకెళ్లాడు. ఆ ఫొటోలను హౌస్ ఉన్న సభ్యులకు కూడా చూపించాడు షణ్ముఖ్. అందులో సిరి ఆ ఫొటోలను చూసి మురిసిపోయింది. ఇక ఆ వీడియోలో మొత్తం నువ్వే కనిపించావురా అని సిరితో అనగానే ఎంతో సంతోషించింది.
































