Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ పరిచయం అవసరం లేని పేరు యూట్యూబర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి షన్నూ ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఇక షన్నూఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అంటే తప్పనిసరిగా టైటిల్ తనకేనని అందరూ భావించారు కానీ బిగ్ బాస్ హౌస్ లో సిరితో ఈయన వ్యవహరించిన తీరు తనని రన్నర్ గా నిలబెట్టింది.

ఇక ఈ కార్యక్రమం తర్వాత ఈయనతో ప్రేమలో ఉన్నటువంటి దీప్తి సునయన ఏకంగా తనకు బ్రేకప్ చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరు విడిపోయినప్పటి నుంచి ఎక్కడ కలిసి కనిపించింది లేదు అయితే సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు పోస్టులు చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఇక కెరియర్ పరంగా ఎవరి పనులలో వారు బిజీ అయ్యారు.
ఈ క్రమంలోనే తాజాగా షణ్ముఖ్ ఒక యూట్యూబ్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఇందులో ఈయన ఫణి పూజిత అనే అమ్మాయితో చాలా రొమాంటిక్ గా నటించారు. ఏకంగా ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయి మరి ఈ పాటకు డాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ వీడియో పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేశారు.

Shanmukh Jaswanth: దీప్తి ఫీల్ అవుతుంది బ్రో…
ఇలా ఈ వీడియో చూసినటువంటి అభిమానులు అరే ఏంట్రా షన్నూ ఇది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం దీప్తి సునయన పై రివెంజ్ తీర్చుకోవడం కోసం ఇలా చేసావు కదా బ్రో అంటూ కామెంట్లో చేస్తున్నారు.మరికొందరు మాత్రం ఈ వీడియో పై స్పందిస్తూ ఇది కనుక దీప్తి సునైనా చూసింది అంటే చాలా ఫీల్ అవుతుంది బ్రో అంటూ ఈ వీడియో పై కామెంట్ లో పెడుతున్నారు. ప్రస్తుతం అయ్యయ్యో అనే పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
































