Shanthi Swaroop: జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ గెటప్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శాంతి స్వరూప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేడీ గెటప్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న శాంతి స్వరూప్ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఈ క్రమంలోనే ఈయన సోషల్ మీడియా వేదికగా తాను తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను అవమానాలు గురించి చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా శాంతి స్వరూప్ మాట్లాడుతూ తాను జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్నప్పుడు ఒక కారు పక్కన నిలబడి ఫోటో దిగి ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశానని చెప్పారు.ఈ ఫోటో షేర్ చేసిన కొంతసేపటికే చాలామంది నీ మొహానికి అంత ఖరీదు కారు ఎప్పుడు కొన్నావు అంటూ కొందరు కామెంట్లు చేయగా ఎవరిపక్కలో పడక వేసి ఈ కారు కొన్నావు అంటూ చాలా నీచాతి నీచమైన కామెంట్లు చేశారని చెప్పుకొచ్చారు.
ఈ విధంగా ఆ రోజు నన్ను కొందరు ట్రోల్ చేయడంతో చాలా బాధపడ్డానని అయితే జబర్దస్త్ కార్యక్రమంలో కష్టపడి స్కిట్ వేసి ప్రతి రూపాయి పోగు చేసి తాను కూడా అలాంటి కారు కొన్నానని ఈయన చెప్పుకొచ్చారు.ఇలా తన కొన్నకారుతో కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నేను ఎవరి పక్కలోనూ పడక వేసి కారు కొనలేదు అలా కనుక చేసి ఉంటే ఎప్పుడో ఇలాంటి ఖరీదైన కార్లు బంగ్లాలు కొనేవాడిని.

Shanthi Swaroop: కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్నాను…
నేను నా టాలెంట్ తో జబర్దస్త్ లో స్కిట్లు చేస్తూ ప్రతి రూపాయి పోగు చేసి ఈ కారు కొన్నాను అంటూ ఎంతో సంతోషంగా తాను కారు కొన్న విషయాన్ని తెలియజేస్తూనే తన గురించి ట్రోల్ చేసిన వారికి తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు. ఇలా శాంతి స్వరూప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.































