Shanti priya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న భానుప్రియ గురించి అందరికీ సుపరిచితమే.ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న భానుప్రియ తనతో పాటు తన సోదరిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ విధంగా భానుప్రియ చెల్లెలుగా శాంతి ప్రియ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

శాంతి ప్రియ సైతం ఇండస్ట్రీలో హీరోయిన్ గా తెలుగు తమిళ కన్నడ హిందీ భాషలలో నటించారు. శాంతి ప్రియ అసలు పేరు శాంతమ్మ. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత ఈమె శాంతి పేరుతో బాగా పాపులర్ అయ్యారు. 80 90 లలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తన కెరీర్ మంచి పొజిషన్లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్నారు.

ఈమె సిద్దార్థ్ రే (సుశాంత్ రే) హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు. వీరికి శుభమ్ రే, షిష్యా రే అనే ఇద్దరు కొడుకులున్నారు. వివాహం తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైన శాంతి తెలుగులోకి మహర్షి సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Shanti priya: వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్న నటి..
నిశాంతి సునీల్ శెట్టి వివేక్ కుబేరాయ్ నటించిన ‘ధారావి బ్యాంక్’ అనే వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది.ఇలా 50 సంవత్సరాల వయసులో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నటి తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. 50 సంవత్సరాల వయసులో కూడా ఈమె ఎంతో ఫిట్ గా ఉండడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



























