Sharath Babu &Ramaprabha : శరత్ బాబు, రమప్రభ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ…. గొడవలకు కారణం….!

0
311

Sharath Babu & Ramaprabha : ఇండస్ట్రీ లో ఎంతోమంది కో వర్కర్స్ ప్రేమించి పెళ్లి చేసుకుని సెటిల్ అయిన వారు ఉన్నారు. అలాంటి జంటల్లో సీనియర్ ఆర్టిస్ట్ రమప్రభ, శరత్ బాబు ఒకరు. రమప్రభ గారు ఆమె కంటే వయసులో చాలా చిన్నవాడైనా శరత్ బాబును ప్రేమించారు. మొదట ఆమెనుండే ప్రేమ మొదలయిందని అప్పటి సీనియర్ జర్నలిస్టులు చెబుతారు. నిజానికి శరత్ బాబు అప్పటికి ఇంకా ఇండస్ట్రీ లో నిలదోక్కుకోలేదు. ఒక రూమ్ లో ముగ్గురితో కలిసి ఉండేవారు. అలాంటి సమయంలో రమప్రభ గారి పరిచయం ప్రేమ వల్ల ఆయనకు అవకాశలు వచ్చాయని అంటారు. తాజాగా శరత్ బాబు గారు అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతు మృతి చెందారు.

పదమూడేళ్ల తరువాత విడాకులు…..

శరత్ బాబు గారు మరణించిన ఈ సమయంలో ఆయన వ్యక్తిగత జీవితంలోని ఇలాంటి సునిశిత విషయాల గురించి చర్చలు సరైనది కాకపోయినా తాజాగా సోషల్ మీడియాలో ఈ కథనాలు ఎక్కువయ్యాయి. రమప్రభ గారే నిర్మాతగా శరత్ బాబు గారిని హీరోని చేస్తూ సినిమా కూడా తీశారు.

అలాగే పలు అవకాశలను కూడా ఆమె ఇప్పించారని అప్పటి వారు చెబుతారు. అలా వారి ప్రేమ కొద్దిరోజులకు పెళ్లి పీటలు ఎక్కింది. పెళ్లి అయిన పదమూడేళ్లకు వారిద్దరు గొడవల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. విడిపోయాక రమప్రభ ,శరత్ బాబు తనని అవసరాలకు వాడుకుని వదిలేసాడని ఆరోపించారు. అయితే శరత్ బాబు మాత్రం ఆమె గురించి కానీ వారి బంధం గురించి కానీ ఎక్కడ మాట్లాడలేదు.