AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
కంచుకోటకు బీటలు..
ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.





























