Sharwanand: శర్వానంద్ బేబీ ఆన్ బోర్డ్…. అప్పుడే శుభవార్త చెప్పబోతున్నారా?

0
70

Sharwanand: టాలీవుడ్ నటుడు శర్వానంద్ గత రెండు నెలల క్రితం రక్షిత రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరి వివాహం జరిగిన తర్వాత ఈయన తిరిగి తన సినిమా పనులలో బిజీ అయ్యారు. అయితే తాజాగా శర్వానంద్ బేబీ అనే విషయం తెలియడంతో అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా శర్వానంద్ బేబీ ఆన్ బోర్డ్ అనే విషయం తెలియగానే శర్వానంద్ అప్పుడే తండ్రి కాబోతున్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా శర్వానంద్ తండ్రి కాబోతున్నారు అనుకుంటే మనం పప్పులో కాలు వేసినట్టే. శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాతనే శర్వానంద్ వివాహం చేసుకున్నారు.

Sharwanand: శర్వానంద్… కృతి శెట్టి

ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం బేబీ ఆన్ బోర్డ్ అనే టైటిల్ తోనే షూటింగ్ పనులను పూర్తి చేశారట. ఈ విధంగా శర్వానంద్ ఈ సినిమా టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు అయితే బహుశా ఈ సినిమాకు బేబీ ఆన్ బోర్డ్ అనే టైటిల్ ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
మరి ఇదే టైటిల్ కన్ఫామ్ చేస్తారో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే యూనిట్ అంతా ఈ చిత్రాన్ని ‘బేబీ ఆన్ బోర్డ్’ (BOB) అని పిలుచుకుంటున్నారట. ఇక ఈ సినిమాలో శర్వానంద్ సరసన కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు