భూమి మీదు ప్రకృతి వివిధ రకాల వింతలను, విశేషాలను కల్పించింది. సాధారణంగా ఎవరైనా వింతలను చూడటానికి ఇష్టపడతారు. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ గా మారుతాయి. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేనిన వెంటనే కొన్ని లక్షల్లో వ్యూస్.. లైక్స్ వస్తుంటాయి. వాటిని చూస్తే మనసు ఎంతో పరవశించి పోతుంది.

మరికొన్నింటిని చూసినప్పుడు.. భయం కూడా వేస్తుంటుంది. కొన్ని జంతువులకు జన్యులోపం వల్ల పుట్టే శిశువులు స్పష్టికి విరుద్దంగా పుడతాయి. అంటే.. రెండు తలలు ఉండటం.. నాలుగు కాళ్లకు బదులు ఎనిమిది కాళ్లు ఉండటం… ఇలా చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం. ఇవి ఎక్కువగా జన్యులోపం వల్లనే జరుగుతుంటుందని వైద్య అధికారులు చెబుతుంటారు.
అయితే ప్రస్తుతం అలాంటి వార్తే ఒకటి వైరల్ గా మారింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఓ గొర్రె రెండు తలల పిల్లకు జన్మనిచ్చింది. జక్రాన్‌పల్లి మండల కేంద్రానికి చెందిన తొగరి లక్ష్మణ్‌కు గొర్రెల మంద ఉంది. ఈ మందలోని ఓ గొర్రె ప్రసవించింది. కానీ ఆ పిల్ల రెండు తలలతో జన్మించిందన్న విషయం ఆ నోటా.. ఈ నోటా.. ఆ గ్రామంలోనే కాదు చుట్టు పక్కల గ్రామాల్లో కూడా తెలిసింది.
అది చూడటానికి వింతగా.. ముద్దుగా ఉండటంతో ఆ గొర్రెను చూడటానికి ప్రజలు తరలివస్తున్నారు. స్థానిక పశు వైద్యులకు ఈ విషయం తెలవడంతో జన్యు లోపం కారణంగా ఇలాంటివి ఏర్పడతాయని వారు స్పష్టం చేశారు.































