Sai Pallavi-Shekhar kammula: శేఖర్ కమ్ముల.. దర్శకత్వంలో తన మార్క్ ను చూపిస్తాడు. ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల కష్టాలు.. సుఖాలు.. ప్రేమలు ఎలా ఉంటాయో ‘హ్యాపీ డేస్’ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించాడు. ప్రస్తుతం చదువుతున్న.. చదవబోయే ఏ ఇంజనీరింగ్ విద్యార్థి అయినా.. ఈ సినిమాను మర్చిపోలేడు. అంతలా అద్భుతంగా తీశాడు.

ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలంగాణ యాసలో వచ్చి.. బంపర్ మెజారిటీ హిట్ సాధించిన మరో చిత్రం ఫిదా. దీనిలో భాను .. హైబ్రిడ్ పిల్ల అంటూ అందరినీ మెప్పించిన హీరోయిన్ సాయి పల్లవి. దీనిలో సాయి పల్లవి తన నటన పరంగా మంచి గర్తింపు తెచ్చుకుంది . తెలంగాణ యాసను అద్భుతంగా పలికింది.

తర్వాత లవ్ స్టోరీ సినిమాలో కూడా శేఖర్ కమ్ముల సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకున్నారు. దీనిలో కూడా ఆమె అందం, అభినయం, డ్యాన్స్ లతో మరోసారి అలరించింది. ఇక లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల తమిళ నటుడు ధనుష్ తో ఓ సినిమా తీయబోతున్నాడు.
దీనిని తెలుగు, తమిళంలో తీసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. హిందీలో కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఏషియన్ గ్రూప్ ఆఫ్ సినిమాస్ యూనిట్ అయిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి చేస్తే.. ఆమె పాన్ ఇండియాలో అడుగు పెట్టినట్లు అవుతుంది.
సాయి పల్లవిని పక్కన పెట్టేసిన శేఖర్ కమ్ముల..
మొన్నటి వరకు కూడా ఇలానే జరుగుతుంది అనుకున్నారు. కానీ ఈ సారి ధనుష్ నటించే ఈ సినిమాలో సాయి పల్లవిపై శేఖర్ కమ్ముల ఆసక్తి చూపడం లేదని వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి కాకుండా.. బాలీవుడ్ హీరోయిన్ ను ఈ సినిమాలో ధనూష్ సరసన నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో సాయి పల్లవి తదుపరి ప్రాజెక్ట్ ఏంటా అని అందరూ ఎదురు చూస్తున్నారు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ధనుష్ నటించిన జగమే తంధీరమ్ విడుదల ఒక సంవత్సరం పాటు ఆలస్యం అయింది. ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, సంచనా నటరాజన్, దీపక్ పరమేష్ తదితరులు నటిస్తున్నారు.





























