Shiva Jyothi: శివ జ్యోతి తీన్మార్ వార్తలు, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా, జ్యోతక్క అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమయ్యారు. తీన్మార్ వార్తలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శివ జ్యోతి అనంతరం బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లారు బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం జ్యోతక్క అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు.

ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఇక తన భర్తతో కలిసి హైదరాబాద్లో నివసిస్తున్న శివ జ్యోతి హైదరాబాద్లో సొంత ఇల్లు ఖరీదైన కారు కొనుగోలు చేశారు. ఇక అత్తవారి కోసం ఒక అందమైన ఇంటిని నిర్మించాలని భావించిన ఈమె ఇంటి నిర్మాణం చేపట్టింది.
ఇలా ఆ ఇంటి పూజా కార్యక్రమాలకు,నిర్మాణానికి సంబంధించిన వీడియోలను కూడా తన యూట్యూబ్ ద్వారా షేర్ చేశారు. అయితే ఇంటి నిర్మాణం పూర్తి కాకుండానే కూలిపోయిందంటూ ఈమె మరొక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొత్త ఇంటి నిర్మాణం చేపట్టిన అనంతరం ఇంటీరియర్ డిజైన్ చేయించారు.

Shiva Jyothi:ఊడిపోయే స్థితిలో సీలింగ్…
ఇంటీరియర్ డిజైన్ పూర్తిగా ఫెయిల్ అయిందని ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంటి సీలింగ్ అప్పుడే ఊడిపోయే పరిస్థితికి వచ్చిందని అలాగే తలుపులకు బాత్రూం డోర్లకు పిల్లలు ఆడుకునే స్టిక్కర్లు అతికించారంటూ ఈమె మండిపడ్డారు. ఇలా గృహప్రవేశం కాకుండానే ఇల్లు పూర్తిగా డామేజ్ అయిందంటూ శివ జ్యోతి ఈ వీడియో ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రస్తుతం శివ జ్యోతి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
































