తెలుగు సినిమా టీవీ నటుడిగా శివాజీ రాజా 1985లో చిత్రరంగ ప్రవేశం చేశారు. దాదాపు అతడు 260కి పైగా చిత్రాల్లో నటించారు. ఎం.వి.రఘు దర్శకత్వంలో గొల్లపూడి రాసిన కళ్ళు అనే నాటిక ఆధారంగా రూపొందిన అదే పేరుగల చిత్రంలో నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ రాజా ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు స్వీకరించాడు.పెళ్ళిసందడి, సిసింద్రీ, ఘటోత్కచుడు, మురారి, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలలో చెప్పుకోదగ్గ పాత్రలలో నటించాడు.

ప్రస్తుతం శివాజీరాజా గురించి ‘మా’ అధ్యక్ష ఎన్నికలసందర్భంగా ఎక్కువగా వినిపిస్తోంది. మా భవనం అమ్మకానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ.. మాకు సంబంధించిన ఫ్లాట్ అమ్మకంలో నేను, నరేశ్ పారదర్శకంగానే వ్యవహరించాం. ఎవరికైనా వివరాలు కావాలంటే అసోసియేషన్‌లో నిజాలు తెలుసుకోవాలి. ఎన్నికల ముందు ఇలాంటి విషయాల గురించి మాట్లాడటం అంత గౌరవం అనిపించుకోదంటూ అతడు ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడారు. ఒక ఆఫీస్ అనేది ఉండాలనే డ్రీమ్ ఫుల్ ఫిల్ కాలేదు కదా.. అని అడగ్గా.. దాని గురించి అడిగేవాడు లేక ఇలా అయిందన్నారు. టాలీవుడ్ లో ఎంతోమంది కొన్ని కోట్లు రెమ్యూరేషన్ తీసుకుంటున్నారు.. కానీ ఆర్టిస్టులకు ఆఫీస్ కట్టలేరా అన్న అనుమానం తనకు కూడా వచ్చిందని.. కానీ ఇలా వెళ్లి వాళ్లను అడిగేవారు లేరు కదా అన్నారు. ఇలా జరుగుతుంది ఆఫీస్ కట్టండి అంటూ అడిగితే కడతారాని.. చిరంజీవి రావడానికి గల కారణం మేము వెళ్లి అడగడం వల్లనే అని అతడు సమాధానం ఇచ్చాడు.
దీనికి సబంధించి ప్రభాస్ ఓ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు అతడి దగ్గరకు తాను వెళ్లి మా భవనానికి సంబంధించి సమస్యను చెప్పానన్నారు. ‘మా’ కు ఈ ప్రోగ్రాంకు వచ్చే డబ్బులు ఇవ్వనా అని అన్నారట. ఇలా వెళ్లి అడిగి.. దగ్గరుండి చేస్తే.. బిల్డింగ్ కట్టడం పెద్ద సమస్య కాదు అంటూ చెప్పాడు.


































