Shivani Rajashekar: శివాని రాజశేఖర్ పరిచయం అవసరం లేని పేరు సీనియర్ హీరో రాజశేఖర్ జీవిత దంపతుల కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివాని రాజశేఖర్ ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలదొక్కుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నారు ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో పలు ఇబ్బందులను ఎదుర్కొన్న ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీలో నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు.

తాజాగా అద్భుతం అనే సినిమా ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చే మంచి సక్సెస్ అందుకున్నారు ఇకపోతే శివాని రాజశేఖర్ కేవలం నటిగా మాత్రమే కాకుండా మోడలింగ్ రంగంలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు గతంలో ఎన్నోసార్లు ఇలా ఫ్యాషన్ షోలో పాల్గొన్నటువంటి ఈమె తాజాగా రాంప్ వాక్ చేస్తూ సందడి చేశారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Shivani Rajashekar: యువరాణిలా మెరిసిపోతున్న శివాని రాజశేఖర్…
గోల్డ్ కలర్ లెహంగాలో అచ్చం యువరాణిలా మెరిసిపోతూ ఉన్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటోర టీచ్ ఫర్ చేంజ్ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈమె ఇలా రాంప్ వర్క్ చేస్తూ మెరిసిపోయారు. ఇలా శివాని రాజశేఖర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసినటువంటి ఎంతో మంది అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.































