Shobana: సినీనటి శోభన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శోభన అనంతరం ఇండస్ట్రీకి దూరమై డాన్స్ స్కూల్ పెట్టుకుని భరతనాట్యం నేర్పిస్తూ ఉన్నారు.ఇలా డాన్స్ స్కూల్ రన్ చేస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నటువంటి శోభన ఇంట్లో తాజాగా దొంగతనం జరిగింది.

శోభన తన తల్లితో కలిసి చెన్నైలోని తేనాంపేట శ్రీనివాస కాలనీలో రెండు అంతస్తుల భవనంలో నివాసం ఉంటున్నారు.మొదటి అంతస్తులు డాన్స్ స్కూల్ నిర్వహించగా రెండవ అంతస్తులో ఈమె తన తల్లితో కలిసి ఉంటున్నారు. అయితే తన తల్లి వయసు పై పడటంతో ఆమెకు సేవ చేయడానికి విజయ అనే ఒక పని మనిషిని నియమించుకున్నారు.
ఈ విధంగా విజయ తన తల్లి బాగోగులు అన్నింటిని చూసుకుంటూ ఉన్నారు అయితే గత నెల మార్చి నుంచి తన తల్లి డబ్బులు దొంగతనానికి గురి కావడం జరుగుతుంది అయితే తన ఇంట్లోకి పనిమనిషి విజయ తప్ప ఎవరూ రావడానికి ఆస్కారమే లేదు దీంతో తన పట్ల అనుమానం వ్యక్తం చేసినటువంటి శోభన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Shobana:పనిమనిషికి మరో అవకాశం ఇచ్చిన శోభన..
ఈమె ఫిర్యాదు మేరకు పోలీసులు పనిమనిషిని విచారించగా అసలు విషయం బయటపడింది.ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ తాను ఆర్థిక ఇబ్బందుల కారణంగానే గత మార్చి నెల నుంచి 41 వేల రూపాయలు దొంగతనం చేశానని ఈ డబ్బును డ్రైవర్ తన కూతురికి గూగుల్ పే చేయించానని ఒప్పుకున్నారు. అయితే నేను చేసినది తప్పే తనని పని నుంచి తొలగించద్దని ఈమె వేడుకోవడంతో శోభన ఆమెకు మరో అవకాశం కల్పించి ఇకపై ఏదైనా అవసరమైతే తనని అడగాలని చెప్పారు. అంతేకాకుండా ఆ డబ్బును జీతంలో కట్ చేసుకుంటానని చెప్పి తనకు మరొక అవకాశం ఇచ్చారు.