ఏపీ ప్రభుత్వానికి షాక్.. 13 మంది వైసీపీ సర్పంచ్ లు రాజీనామా..

0
139

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేసుకుంటూ.. ప్రజల మన్ననలు పొందుతూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పలు సంక్షేమ పథకాలతో పాటు.. ప్రతీ గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే పరిష్కారం చూపుతూ పాలన సాగిస్తున్నారు. ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన జగన్ ప్రభుత్వం.. ఆ ఫలితాన్ని ఇటీవల జరిగిన 13 మున్సిపల్ ఎన్నికల్లో చూశారు.

ఒక్క మున్సిపాలిటీ తప్ప అన్నీ కైవసం చేసుకున్నారు. ఈ ఘనత అంత ప్రజలదే అని.. వాళ్లు తమకు 100 కు 97 మార్కులు ఇచ్చారని.. ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. ఇదంతా ఇలా ఉండగా.. కడప జిల్లాలోని వైసీపీ సర్పంచ్ లు మూక్కుముడిగా రాజీనామా చేశారు. ఇది ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మరింది.

మంచి జోష్ లో ఉండి.. ముందుకు దూసుకపోతున్న వైసీపీకి ఇది పెద్ద షాకింగ్ అనే చెప్పాలి. అసలెందుకు వాళ్లు ఈ పిని చేశాడు.. అసలేమైందంటే.. వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.. కడప జిల్లా కాజీపేట మండలంలో వైసీపీ సర్పంచులు గ్రామ పంచాయతీకి నిధులు రావడం లేదన్న ఆవేదనతో 13 మంది వైసీపీ సర్పంచులు ఒకేసారి రాజీనామా చేశారు. నిధులు మంజూరు కాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని.. చేతి నుంచి డబ్బులను పెట్టుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రమాణం స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదని అన్నారు. ఇంకా చాలామంది రాజీనామాలకు సిద్ధ పడ్డారని.. ప్రభుత్వంపై రాజీలేని పోరాటానికి తాము సిద్ధం అంటూ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here